దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన చిత్రం పెళ్లి సందD. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అందించిన ఈ చిత్రానికి గౌరి రోణంకి దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించారు. (Sreeleela/Instagram)
ఈ సినిమా 2021 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా.. మంచి విజయాన్ని అందుకుంది. గతంలో పెళ్లి సందడి సంగీతం అందించిన కీరవాణి, గీతా రచయిత చంద్రబోస్ ఈ సినిమాకి కూడా పనిచేయడం విశేషం. అంతేకాదు తండ్రి నటించిన టైటిల్‌తో తనయుడు హీరోగా నటించి హిట్ అందుకోవడం మరో విశేషం. ఈచిత్రంలో రాఘవేంద్రరావు కూడా కీలక పాత్రలో కనిపించి అదరగొట్టారు. Photo : Instagram
ఇక అది అలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన శ్రీలీలకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. యంగ్ హీరోలు ఆమెనే హీరోయిన్గా రికమెండ్ చేస్తున్నారట. టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందంటే చాలు అందరి దృష్టి అటువైపే ఉంటుంది. దీనికి కారణం తెలుగులో హీరోయిన్ల కొరత చాలా ఎక్కువగా ఉందన్న సంగతి తెలిసిందే. Photo : Instagram
శ్రీలీల ఈ భామ ప్రభాస్, మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రాజా డీలక్స్’లో ఒక హీరోయిన్గా ఈమెనే తీసుకున్నట్టు సమాచారం. దీనిపై త్వరలో అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. తాజాగా ఈ భామ రామ్, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అయింద. Photo : Instagram
శ్రీలీల 2001 జూలై 14న యునైటైడ్ స్టేట్స్లో జన్మించింది. తెలుగు ఫ్యామిలీలో పుట్టిన ఈమె తల్లి ప్రముఖ గైనకాలిస్ట్. ఆ తర్వాత యూఎస్‌లో జన్మించిన ఈమె బెంగుళూరులో చదువుకుంది. ఈమె పెళ్లి సందD సినిమా కంటే ముందు ఈమె కన్నడలో ‘కిస్’, ’భారతే’ అనే సినిమాల్లో నటించింది. అక్కడ నటిస్తూనే తెలుగులో తన లక్‌ను పరీక్షించుకుంది. ( Photo : Instagram)
అంతేకాదు కన్నడలో కిస్ సినిమాలోని నటనకు సైమా బెస్ట్ యాక్ట్రెస్ డెబ్యూ అవార్డు అందుకుంది. ప్రస్తుతం ఈ భామ వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతుంది. మొత్తంగా ఈమెకు ప్రభాస్, మహేష్ బాబు సినిమాల్లో ఛాన్సులొస్తున్నాయి. మరి ఆ అవకాశాలను ఈ భామ ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి. మరోవైపు బాలకృష్ణ అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపించనుంది. మరి ఈ సినిమా శ్రీలీల ఎలా యాక్ట్ చేస్తుందనేది చూడాలి. Photo : Instagram