స్పోర్ట్స్ నేపథ్యంలోనే కథలు రాసుకుంటే.. ఆ సినిమాలకు ఆదరణ కూడా బాగానే ఉంటుంది. ఈ విషయం చాలా సార్లు రుజువైంది కూడా. కాస్త స్క్రీన్ ప్లే పకడ్భందీగా ఉంటే కచ్చితంగా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చే సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నాటి సై నుంచి నిన్నమొన్నటి జెర్సీ వరకు తెలుగులో అలాంటి అద్భుతాలు చాలానే ఉన్నాయి. అందుకే రాబోయే కాలంలో కూడా ఎక్కువగా స్పోర్ట్స్ నేపథ్యమున్న కథలే వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుతో పాటు హిందీలోనూ ఇలాంటి కథలకే డిమాండ్ పెరిగిపోయింది. అందుకే ఆటాడుకుందాం రా అంటున్నారు మన హీరోలు. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అన్నిచోట్లా ఇప్పుడు స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ కథలకు ప్రాధాన్యత పెరిగిపోయింది. కొందరి బయోపిక్స్ కూడా వస్తున్నాయి.
1. 83: ఇండియన్ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విజయం 1983 వరల్డ్ కప్. ఈ కథ ఇతివృత్తంగా కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ రోజు విడుదలై అద్భుతమైన రెస్సాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాకు చూస్తుంటే.. ఆనాటి ప్రపంచ కప్ క్రికెట్ కళ్ల ముందు కదలాడుతోంది. కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటించాడనే కంటే జీవించాడానే చెప్పాలి. 2021 జాతీయ ఉత్తమ నటుడిగా రణ్వీర్ సింగ్ కు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మొత్తంగా ‘83’ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీస్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. (Twitter/Photo)