ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie) కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారం రోజుల నుంచి ఫ్యాన్స్ టికెట్ల (RRR Tickets) వేట మొదలుపెట్టారు. ఇప్పటికే మొదటి రోజుకు సంబంధించిన అన్నీ థియేటర్లు హౌస్ ఫుల్ అయిపోయాయి. బ్లాక్ లో మాత్రం భారీ రేట్లకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ సినిమా సందర్భంగా పవన్ ఫ్యాన్స్ స్క్రీన్ల వద్దకు వెళ్లి హడావిడి చేయడంతో పలుచోట్ల స్క్రీన్లు దెబ్బతిన్నాయి. ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటిస్తుండటంతో మరోసారి భీమ్లా నాయక్ వంటి ఘటనలు రిపీట్ అవకుండా థియేటర్ల యాజమాన్యాలు ముందు జాగ్రత్త తీసుకుంటున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)