జూలై 7న ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత హరీష్ షా (76) నోటి క్యాన్సర్ తో కన్నమూసారు. 'మేరే జీవన్ సాథీ, కాలా సోనా, రామ్ తేరే కిత్నే నామ్' సినిమాలను హరీశ్ షా నిర్మించారు. 'ధన్ దౌలత్, జల్ జలా, అబ్ ఇన్సాఫ్ హోగా' చిత్రాలను ఆయన తెరకెక్కించారు. 2003లో వచ్చిన 'జాల్ : ద ట్రాప్' నిర్మాతగా ఆయన లాస్ట్ మూవీ. (News18/Photo)
అక్టోబర్ 15 వ భారతదేశపు మొట్టమొదటి ఆస్కార్ విజేత, కాస్ట్యూమ్ డిజైనర్ భాను అథ్థయ్య ముంబైలో కన్నుమూశారు.ఆమె వయసు 91 ఏళ్లు. 1956లో సీఐడీ చిత్రంతో కాస్ట్యూమ్ డిజైనర్ గా మారిన భాను.. 1983లో రూపుదిద్దుకున్న 'గాంధీ' చిత్రానికి గానూ ఆస్కార్ ను అందుకున్నారు. 'లేకిన్, లగాన్' చిత్రాలు ఆమెకు జాతీయ అవార్డులను ఇప్పించాయి. (Bhanu Athaiya)
సౌమిత్రా ఛటర్జీ (Soumitra Chatterjee): సీనియర్ బెంగాలీ నటుడు సౌమిత్రా ఛటర్జీ నవంబరు 15న కోల్ కతాలో మరణించారు. 85 ఏళ్ల సౌమిత్ర గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కరోనా వచ్చి ఆసుపత్రి పాలై ఆతరువాత నెగటివ్ వచ్చాక కూడా మొత్తం 40 రోజులు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి చివరికి తనువు చాలించారు. (Twitter/Photo)