HBD Vijay: సౌత్ సూపర్ స్టార్ విజయ్ ప్రేమ పెళ్లిలో ఇన్ని ట్విస్టులున్నాయా.. సినిమాను తలదన్నే రీతిలో ఉందిగా..

HBD Vijay | తమిళ స్టార్ హీరో విజయ్.. తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ ప్రముఖ యాక్షన్ దర్శకుడు. ఆయన డైరెక్ట్ చేసిన పలు చిత్రాల్లో విజయ్ బాలనటుడిగా నటించారు. ఆ తర్వాత తండ్రి దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాలయై తీర్పు’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసారు. తొలి సినిమాతోనే యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక హీరోగా పీక్స్‌లో ఉండగానే.. తాను ప్రేమించిన సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరి పెళ్లి కూడా ఎంతో నాటకీయంగా జరిగింది.