Rashmika mandanna: టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలిచింది. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి.. బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంది. ఇండియా క్రష్ గా పిలువబడే రష్మిక మందన ఇటీవలే మోస్ట్ డిజైరబుల్ హీరోయిన్ గా కూడా నిలిచింది. ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉండి ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ ఫోటో షేర్ చేసుకోగా అందులో పర్పుల్ డ్రెస్సుతో యువత మతిపోయేలా చేసింది. పైగా అందులో ఎంతో హాట్ గా కనిపిస్తూ రొమాంటిక్ లుక్ తో ఫోటోకి ఫోజ్ ఇచ్చింది. పెద్ద పనులు చేయబోయే అమ్మాయి.. చిన్న విషయాలను పట్టించుకోదు అంటూ.. ఈ విషయం తనకు బాగా రిలేట్ అవుతుందని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా ఏకంగా 32 లక్షల మందికి పైగా లైక్ చేశారు. తన అందాన్ని తెగ పొగుడుతున్నారు.