South cinema Top Stars In Instagram : ప్రస్తుతం సోషల్ మీడియా సమాచారాన్ని చేరవేయడంలో ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం తమ ఫోన్లో నెట్ ఉంటే చాలు.. ప్రపంచం మొత్తం చేతిలో ఉన్నట్టే. ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకుని సినీ నటులు తమ సినిమాలకు సంబంధించిన విశేషాలను తమ అభిమానులకు చేరవేస్తున్నారు. తమ సినిమాలకు కావాల్సిన పబ్లిసిటీని తెచ్చుకుంటున్నారు. (Instagram/Photo)
ఒకప్పుడు తమను తాము ప్రమోట్ చేసుకోవాలంటే మీడియాపై ఆధారపడే వాళ్లు అప్పటి హీరోలు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రమోషన్ అనేది నెక్ట్స్ లెవల్‌కు వెళ్లిపోయింది. ఇప్పుడు ఏదైనా కూడా ఒక్క క్లిక్ చాలు. సోషల్ మీడియాలో అలా పోస్ట్ చేస్తే.. ఇలా లక్షల్లో వ్యూస్ వచ్చేస్తుంటాయి. అలా సౌత్ ఇండియాలో చాలా మంది హీరోలు సోషల్ మీడియాలో.. మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు. కోట్ల మంది ఫాలోయర్స్‌తో రప్ఫాడిస్తున్నారు. అలా ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోయర్స్ ఉన్న 10 మంది సౌత్ ఇండియన్ హీరోలను ఇప్పుడు చూద్దాం..
3. యశ్: 13.4 మిలియన్.. కన్నడ టీవీ సీరియల్స్‌తో మొదట నటుడిగా ప్రస్థానం ప్రారంభించి అంచలంచెలుగా కన్నడ టాప్ స్టార్ గా ఎదిగారు యశ్. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్’తో ఒక్కసారి ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఈ యేడాది KGF 2 మూవీతో పలకరించారు. ఇతను దుల్కర్‌తో సమానంగా సోషల్ మీడియా ఫ్లాట్‌పామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ పెరిగారు. ఈయన కూడా 13.4 మిలియన్ ఫాలోవర్స్‌తో 7వ స్థానం నుంచి మూడో ప్లేస్‌లోకి ఎగబాకారు. (Instagram/Photo)
4. దుల్కర్ సల్మాన్: 12.1మిలియన్.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. అనతి కాలంలో తండ్రి తగ్గ తనయుడిగా రాణిస్తున్నారు. ఈయన తెలుగు ప్రేక్షకులకు‘మహానటి ’మూవీతో దగ్గరయ్యారు. ఇపుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ‘సీతా రామం’ మూవీతో మరో సక్సెస్ అందుకున్నారు.ప్రస్తుతం సౌత్ ఇండియా రామ్ చరణ్ ఇతను 4వ స్థానంలోొ ఉన్నారు. Twitter/Photo)
6. ప్రభాస్: 9.2 మిలియన్.. బాహుబలి సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. అంతేకాదు మన దేశం నుంచి మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు బొమ్మగా కొలువైన తొలి దక్షిణాది హీరోగా రికార్డులకు ఎక్కారు. త్వరలోనే ఈయన ‘ఆది పురుష్’,సలార్, ప్రాజెక్ట్ K వంటి క్రేజీ మూవీస్‌తో పలకరించనున్నారు. దక్షిణాదిలో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లో నాల్గో ప్లేస్‌లో ఉన్నారు. కానీ రెమ్యునరేషన్ విషయంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. (Instagram/Photo)
9. ఎన్టీఆర్ | ఎన్టీఆర్ .. ఆర్ఆర్ఆర్ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇక మాస్ హీరోగా మాంచి ఫాలోయింగ్ ఉన్న తారక్‌కు సోషల్ మీడియాలో తక్కువ మందే ఫాలోవర్స్ ఉన్నారు. ఇతనికి 5.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈయన సౌత్ హీరోల్లో 9వ స్థానంలో ఉన్నారు. మొత్తంగా హీరోల ఫాలోయింగ్‌కు సోషల్ మీడియా ఫాలోయింగ్‌కు అసలు సంబంధం లేదనే చెప్పాలి. (Jr Ntr Photo/ Twitter)
9. రానా దగ్గుబాటి: 4.8 మిలియన్ ఫాలోవర్స్‌తో దక్షిణాది హీరోల్లో పదో స్థానంలో ఉన్నారు. ఈయన వెంకటేష్ నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి .. హీరోగానే కాకుండా కథ డిమాండ్ చేస్తే.. విలన్‌గా చేయడానికి వెనకడుగు వేయడం లేదు. బాహుబలితో రానా క్రేజ్ అమాంతం పెరిగింది. 10వ స్థానంలో నిలిచారు. (Instagram/Photo)