టాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్ర సీమలో వరుసగా సీక్వెల్స్ క్యూ కడుతున్నాయి. ఒక కథకు కొనసాగింపుగా ఈ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. కొన్ని సినిమాలు అలా సీక్వెల్స్‌గా కొనసాగుతూనే ఉన్నాయి. అందులో కొన్ని సినిమాలు కథ కంచికి చేరితే.. మరికొన్ని కథలు.. ఒక సినిమా ఎక్కడ మొదలైందో అంతకు ముందు జరిగిన కథను ప్రీక్వెల్స్‌గా తెరకెక్కించే పనిలో పడ్డారు దర్శకులు.
‘గాడ్ ఫాదర్’ మూవీ క్లైమాక్స్‌లో చిరంజీవిని డాన్‌గా చూపించారు. ఆ పాత్ర ఫ్లాష్ బ్యాక్ ఏంటి ? అతను దుబాయ్‌లో ఏం చేసాడు. డాన్‌గా ఎలా ఎదిగాడనేది ఈ సినిమాలో చూపించలేదు. ఇపుడు ప్రీక్వెల్‌ను సిద్ధం చేస్తున్నారు. మలయాలంలో ఇప్పటికే ‘లూసీఫర్ 2’ ప్రీక్వెల్‌కు అంతా సిద్ధమైంది. అదే కథతో ప్రీక్వెల్ రూపొందిస్తారా ? లేకపోతే వేరే కథతో చిరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తారా అనేది చూడాలి. (Twitter/Photo)
కాంతారా | రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార’ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 450 కోట్ల పై చిలుకు గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇపుడీ సినిమాకు రెండో భాగం తెరకెక్కనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని ‘కాంతార’ కథ ఎక్కడ షురూ అయిందో అక్కడ నుంచే ఈ సినిమా కథ మొదలు కానుంది. ఫస్ట్ పార్ట్‌లో హీరో తండ్రి అడవిలోకి మాయమైపోతాడు. ఇక ఊరి భూమిని కాపాడానికి హీరో తండ్రికి పంజుర్లి దైవం ఎలా సహకరించదనేది రెండో భాగంలో చూపించనున్నారట. ఈ చిత్రం జూన్‌లో సెట్స్ పైకి వెళ్లి వచ్చే యేడాది సమ్మర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. (Twitter/Photo)
ఖైదీ | ఖైదీ, విక్రమ్ సినిమాలతో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్.. ఇపుడు విజయ్‌తో ‘లియో’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ‘ఖైదీ’ మూవీకి రెండో భాగం తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఫస్ట్ పార్ట్‌కు ముందుకు జరిగిన కథతో తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కార్తి పదేళ్లు జైల్లో ఉండి ఆ తర్వాత విడుదలవుతారు. అసలు కార్తి జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. తన కూతురుకు ఎలా దూరమయ్యాడు. భార్య ఎలా చనిపోయింది. ఇక విలన్ ఆది శంకరానికి హీరో దిల్లీకి మధ్య విరోదాన్ని చూపించలేదు. రెండో భాగంలో ఖైదీ 2లో ఆన్సర్ చూపించనున్నారు. ఈ యేడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. (Twitter/Photo)
భారతీయుడు 2 | శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భారతీయుడు’ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఇపుడీ సినిమాకు రెండో భాగంగా భారతీయుడు 2 తెరకెక్కుతోంది. ఈ సినిమా కథ ముసలి కమల్ హాసన్.. సేనాపతి పాత్రకు సంబంధించిన స్టోరీతో మొదలుకానుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో సేనాపతికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని ఎలా సాల్వ్ చేసాడనేది ‘భారతీయుడు 2’లో చూపించనున్నట్టు సమాచారం. ఇందులో సేనాపతి తండ్రి పాత్రను కూడా చూపించనున్నారు. ఆ క్యారెక్టర్‌ను కూడా కమల్ హాసన్ చేయనున్నట్టు ఈ సినిమా రచయత జయమోహన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. (File/Photo)
పొన్నియన్ సెల్వన్ 2 : Ponniyin Selvan 2 : విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్ -1. ఈ సినిమాకు కూడా సీక్వెల్ కూడా రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా 2023 ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. Photo : Twitter
ఎఫ్ 4 : F4 : వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘ఎఫ్ 2’. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ వచ్చి మంచి విజయాన్నే అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ‘ఎఫ్ 4’ కూడా రానుంది. ఈ సినిమా 2023 చివర్లో విడుదల కానుందని టాక్. ఈ సినిమా బాలయ్య సినిమా పూర్తి అయ్యిన తర్వాత రానుందని అంటున్నారు. Photo : Twitter
జాంబి రెడ్డి 2: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 5న విడుదలైంది. థియేటర్స్ 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నపుడు వచ్చిన ఈ చిత్రం రూ. 5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సేఫ్ జోన్లోకి వచ్చింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఇప్పుడు తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు ప్రశాంత్. త్వరలోనే పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.