South India All Time Biggest Grossing Movies: భారతీయ బాక్సాఫీస్ దగ్గర సౌత్ సినిమాలు సత్తా చూపాయి. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ రూ. 1212.50 కోట్ల వసూళ్లను సాధించింది. ఆ తర్వాత విడుదలైన కేజీఎఫ్ 2 మూవీ కూడా భారతీయ బాక్సాఫీస్ దగ్గర మాయ చేసింది. తాజాగా KGF 2 లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను ఆర్ఆర్ఆర్ క్రాస్ చేసింది. ఇక సౌత్ ఇండియా టాప్ లిస్టు మూవీస్‌లో రిషబ్ శెట్టి కాంతారాతో పాటు మణిరత్నం పొన్నియన్ సెల్వన్, విక్రమ్, వారసుడు, తునివు సినిమాలు కూడా చేరాయి. (File/Photo)
1 .బాహుబలి 2: ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈమె సంచలన సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1810 కోట్లు వసూలు చేసి భారతీయ బాక్సాఫీస్ దగ్గర రెండో అతిపెద్ద విజయంగా నిలిచింది. కానీ మన దేశ బాక్సాఫీస్ విషయానికొస్తే.. ఇప్పటికే బాహుబలి 2 టాప్‌లో ఉంది. 2017లో విడుదలైన బాహుబలి 2 అప్పటి వరకు ఉన్న భారతీయ సినిమా రికార్డులను తిరగరాసింది.
3. .RRR ఆర్ఆర్ఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా తెరకెక్కిన సినిమా మూడు రోజుల్లోనే రూ. 500 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండు వారాల్లోపే ఈ సినిమా రూ. 1000 కోట్ల క్లబ్బులో చేరింది. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఈ సినిమా జపాన్ కలెక్షన్స్ కలిపి ఓవరాల్‌గా రూ. 1236.50 కోట్లు గ్రాస్ వసూళ్లతో సౌత్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మూడో ప్లేస్నుంచి రెండో ప్లేస్‌కి ఎగబాగింది. (Twitter/Photo)
3. KGF Chapter 2 | కెజియఫ్‌తో రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన యశ్ (Yash).. ఇప్పుడు కెజియఫ్ 2 (KGF Chapter 2) మూవీతో పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 1233 కోట్లతో భారతీయ బాక్సాఫీస్ దగ్గర టాప్ 3లో నిలిచింది. సౌత్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర రెండో ప్లేస్‌లో ఉంది. 2022లో టాప్ ఇండియన్ గ్రాసర్ మూవీగా రికార్డులకు ఎక్కింది. తాజాగా ఈ సినిమా దక్షిణాది భారతీయ బాక్సాఫీస్ దగ్గర మూడో ప్లేస్‌లో నిలిచింది. (File/Photo)
6. పొన్నియన్ సెల్వన్ | మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష ముఖ్యపాత్రల్లో నటించిన పొన్నియన్ సెల్వన్ సినిమా ఇప్పటి వరకు రూ. 487.50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. సౌత్ ఇండియన్ టాప్ మూవీస్‌లో బాహుబలి తర్వాత టాప్ 6లో స్థానం సంపాదించుకుంది. (Ponniyin selvan 1 Twitter)(Twitter/Photo)
8. విక్రమ్ | లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘విక్రమ్’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా.. హీరోగా కమల్ హాసన్ స్టామినా ఏంటో చూపించింది. మొత్తంగా ఈ సినిమా రూ. 417.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టింది. సౌత్ ఇండియా టాప్ మూవీస్‌లో 8వ స్థానంలో నిలిచింది. (Photo Twitter)
11. వారిసు | దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ ‘వారిసు’. తెలుగులో ఈ సినిమాను ‘వారసుడు’ పేరుతో డబ్బైంది. ఈ సినిమా దక్షిణాది బాక్సాఫీస్ దగ్గర రూ. 301.4 కోట్ల గ్రాస్ వసూళ్లతో 12వ స్థానం నుంచి 11 ప్లేస్‌లోకి ఎగబాకింది. (Twitter/Photo)
16.అల వైకుంఠపురములో: అల్లు అర్జున్ రేంజ్ మరింత పెంచేసిన సినిమా అల వైకుంఠపురములో. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో 25.93 కోట్ల షేర్ వచ్చింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 256.35 కోట్టు..వసూళు చేసి సౌత్ ఇండియా బిగ్గెస్ట్ గ్రాసింగ్ మూవీస్‌లో 16వ స్థానంలో నిలిచింది. (Twitter/Photo)
20. సైరా నరసింహారెడ్డి: చిరంజీవి హీరోగా వచ్చిన సైరా సినిమాకు కూడా రికార్డు బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు రూ. 187 కోట్ల బిజినెస్ జరిగితే.. 135 కోట్లు మాత్రమే వసూలు చేసింది. తద్వారా రూ. 50 కోట్ల నష్టాలతో ఫ్లాప్ లిస్టులోకి వెళ్లిపోయింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 236.40 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ మూవీ సౌత్ ఇండియా బిగ్గెస్ట్ గ్రాసింగ్ మూవీస్‌లో 20వ స్థానంలో నిలిచింది. (Twitter/Photo)
23. బీస్ట్ | తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'బీస్ట్' సినిమా 2022 ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించారు. మంచి అంచనాల విడుదలైన ఈ సినిమా పెద్దగా అలరించలేక పోయింది. కానీ బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ వసూళ్లనే రాబట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 119.61 కోట్లు షేర్ (రూ. 235.05 కోట్ల గ్రాస్ ) కలెక్షన్స్ రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా 125.50 కోట్లకు అమ్మారు. రూ. 127 కోట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా బరిలో దిగి.. కేజీఎఫ్ 2 దాటికి తట్టుకొని ఈ సినిమా రూ. 7.39 కోట్ల లాస్‌తో ఈ సినిమా అబౌ యావరేజ్‌గా నిలిచింది. రూ. 235.05 కోట్ల కలెక్షన్స్‌తో దక్షిణాదిలో 23వ స్థానంలో నిలిచింది. (Twitter/Photo)