హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

South india All Time Biggest Grossing Movies: సౌత్‌లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన టాప్ సినిమాలు.. KGF 2 ఆ రికార్డ్‌ను బీట్ చేసిన RRR..

South india All Time Biggest Grossing Movies: సౌత్‌లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన టాప్ సినిమాలు.. KGF 2 ఆ రికార్డ్‌ను బీట్ చేసిన RRR..

Top Highest Gross South Indian Movies : ఒకప్పుడు భారతీయ సినిమా అంటే హిందీలో వచ్చే సినిమాల గురించే చెప్పుకునేవారు. ఇక బాలీవుడ్ వాళ్లు ఎప్పటి నుంచో సౌత్ సూపర్ హిట్ కథలను అక్కడ రీమేక్ చేసి మంచి సక్సెస్‌లు అందుకున్నారు. అటు బాలీవుడ్‌లో హిట్టైన కొన్ని సినిమాలను మన వాళ్లు రీమేక్ చేసిన సందర్భాలున్నాయి. ఇక దక్షిణాది నుంచి చాలా మంది దర్శకులు బాలీవుడ్‌లో సినిమాలు డైరెక్ట్ చేసి హిట్స్ అందుకున్నారు. కానీ రాజమౌళి తీసినా బాహుబలి సినిమాతో దక్షిణాది సినిమా సరిహద్దులు చెరిపేసుకుంది. అంతకు ముందు మణిరత్నం, శంకర్, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి దర్శకులు, హీరోలు కొన్ని ప్యాన్ ఇండియా సినిమాలతో పలకరించినా.. పూర్తి స్థాయిలో మాత్రం బాహుబలితో అన్ని హద్దులు చెరిపేసింది. ఆ బాటలో చాలా మంది దక్షిణాది హీరోలు ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు రూ. 1200 కోట్లను క్రాస్ చేసి సంచలనం రేపాయి.

Top Stories