Trisha Krishnan: హీరోయిన్ త్రిష పెళ్లి అంటూ ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు వచ్చాయ్. అలానే ఇప్పుడు తమిళ్ మీడియాలో త్రిష పెళ్లి వార్తలు హాట్ టాపిక్ గా మారాయ్. త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని.. అందు కోసం త్రిష కుటుంబసభ్యులు సీరియస్ గా సంబంధాలు చూస్తున్నారని, ఈ క్రమంలోనే ఓ ఐటీ ఎంప్లాయ్తో త్రిషకు పెళ్లి ఫిక్స్ అయ్యిందని ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. ఇక ఈ వార్త నిజం అని తెలియాలంటే త్రిష నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా ఇప్పటికే త్రిష పెళ్లి అని ఎన్నోసార్లు ఇలానే వార్తలు రాగా అవి కేవలం పుకార్లేనని.. అందులో నిజం లేదని తేలింది. మరి ఈసారి వచ్చిన వార్తల్లో ఎంత నిజం ఉందనేది చూడాలి.