South Day1 WW Top Grossing Movies: ఒకప్పుడు భారతీయ సినిమా అంటే హిందీ సినిమాలు అదే బాలీవుడ్ సినిమాలే గుర్తు వచ్చేవి. వాటి వసూళ్లు మన ప్రాంతీయ భాష చిత్రాల కంటే ఎక్కువగా ఉండేవి. కానీ ఇపుడు పరిస్థితులు మారాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ తో సీన్ మారిపోయింది. మన తెలుగు సహా మిగతా దక్షిణాది సినిమాలు ఉత్తరాది ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అంతేకాదు బాలీవుడ్ సినిమాలను తలదన్నే వసూళ్లను సాధిస్తున్నాయి. ఈ యేడాది ఆర్ఆర్ఆర్, కేజీఎప్2 మంచి వసూళ్లనే సాధించాయి. తాజాగా మణి రత్నం పొన్నియన్ సెల్వన్ 1 కూడా దేశ వ్యాప్తంగా అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
1. RRR 1st Day World Wide Highest Gross Movies: టాలీవుడ్లో దక్షిణాదిలో బడా హీరో సినిమా విడుదలైతే.. ఆ రచ్చే వేరుగా ఉంటోంది. మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు మోత మోగడం ఖాయం. ఆర్ఆర్ఆర్ విడుదలతో తెలుగు సహా దక్షణాదిలో మరోసారి రికార్డుల వేట మొదలైంది. నైజాంలో పెద్ద సినిమాల టోటల్ కలెక్షన్స్‌ను ఆర్ఆర్ఆర్ మూవీ మొదటి రోజే వసూళు చేసి అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో నైజాం సహా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రికార్డులు మటు మాయమయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ డే రికార్డులు బద్దలు కొట్టడం మళ్లీ రాజమౌళికి సాధ్యమేమే. (RRR movie)
1.ఆర్ఆర్ఆర్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీ విజయం విజయం దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రికార్డు క్రియేట్ చేసింది. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు.. రూ. 135 కోట్ల షేర్ (రూ. 235 కోట్ట గ్రాస్) వసూళ్లను రాబట్టి అన్ని రికార్డులను వెనక్కి నెట్టి తెలుగు, దక్షిణాది సహా దేశ వ్యాప్తంగా మొదటి అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. (Twitter/Photo)
7.బీస్ట్ | తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'బీస్ట్' సినిమా 2022 ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించారు. మంచి అంచనాల విడుదలైన ఈ సినిమా పెద్దగా అలరించలేక పోయింది. కానీ బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు రూ. 45 కోట్ల షేర్ (రూ. 86.15 గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 119.61 కోట్లు షేర్ (రూ. 235.05 కోట్ల గ్రాస్ ) కలెక్షన్స్ రాబట్టింది. (Twitter/Photo)
9.ఇక ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే.. బాక్స్ ఆఫీస్ దగ్గర మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన పొన్నియన్ సెల్వన్ 1 సినిమా దాదాపుగా అన్ని చోట్లా మంచి కలెక్షన్స్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సినిమా అంచనాలను అన్నీ కూడా మించి పోయి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు రూ. 82.30 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి దక్షిణాదిలో అత్యధిక వసూళ్లను సాధించిన 9వ చిత్రంగా నిలిచింది. (Twitter/Photo)
10. బాహుబలి: రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో 2015లో విడుదలైన బాహుబలి సినిమా తెలుగు రాష్ట్రాల్లో 22.4 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.46 కోట్ల షేర్ (రూ. 73.40 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించి దక్షిణాదిలో మొదటి రోజు అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధంచిన చిత్రాల్లో టాప్ 10లో నిలిచింది. (Twitter/Photo)