నటి మీరా జాస్మిన్ క్రిస్మస్ వేడుకలను ఎంజాయ్ చేస్తోంది. తాను 20 రోజుల ముందే క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ప్రారంభించానని నటి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది. నటి క్రిస్మస్ ఫోటో వైరల్‌గా మారింది.
తెలుగులో పలు సినిమాలు చేసిన మీరా జాస్మిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మీరా జాస్మిన్ తాాజాగా క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. నటి షేర్ చేసిన ఫోటోలకు నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
2/ 7
తెలుగులో మీరా జాస్మిన్ పవన్ కళ్యాన్. రవితేజ వంటి హీరోలతో నటించింది. మీలా సినిమాలో కనిపించిన మీరా జాస్మిన్ కన్నడ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇప్పుడు నటి నలుపు రంగు డ్రెస్‌లో సింపుల్‌గా & స్టైలిష్‌గా కనిపిస్తోంది.
3/ 7
ఈ భామ ఇప్పుడు తన క్యూట్ లుక్స్, ఇన్నోసెంట్ లుక్, గ్లామర్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. నటి బరువు కూడా తగ్గింది.
4/ 7
హోమ్లీ లుక్స్‌తో వెండితెరపై తన మార్క్ చూపించిన మీరా జాస్మిన్.. కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు హాట్ గేర్ వేసింది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ హాట్ అండ్ స్వీట్ స్టిల్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తోంది. దీంతో మళ్ళీ మీరా జాస్మిన్ ట్రెండ్ షురూ అయింది.
5/ 7
గ్లామర్ ప్రపంచానికి దూరమైందని అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా రీ ఎంట్రీ ఇచ్చి తన షాకింగ్ లుక్స్ పంచుకుంటోంది మీరా జాస్మిన్. ఫిజిక్ పరంగా తాను ఎంతలా ట్రాన్స్ఫామ్ అయ్యాననేది స్పష్టం చేస్తూ తన నాజూకు అందాలను సోషల్ మీడియాలో పెట్టేస్తోంది.
6/ 7
తెలుగులో అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, భద్ర, మహారధి, రారాజు, యమగోల మళ్ళీ మొదలైంది, గోరింటాకు, మా ఆయన చంటి పిల్లాడు, బంగారు బాబు, అ ఆ ఇ ఈ, ఆకాశ రామన్న వంటి చిత్రాల్లో నటించింది మీరా జాస్మిన్. చివరగా మోక్ష అనే సినిమాలో కనిపించింది.
7/ 7
2014 సంవత్సరంలో దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేసే అనిల్ జాన్ టైటస్‌ను పెళ్ళాడి దుబాయ్ వెళ్లిపోయింది. తిరిగి ఇన్నేళ్లకు మళ్ళీ యాక్టీవ్ అయింది మీరా. హాట్ గేర్ వేసి సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. మీరా షేర్ చేసిన హాట్ ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.