ఒక భాషలో హిట్టైయిన చిత్రాన్ని వేరే భాషలో రీమేక్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటి వరకు ఓటీటీ వేదికగా విడుదలైన ఏ సినిమాలు కూడా పూర్తి స్థాయి పాజటివ్ టాక్ రాలేదు. కానీ సూర్య నటించిన ‘సూరారై పొట్రు’ చిత్రం హిట్ కాదు ఏకంగా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ పినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదలై ఇక్కడ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది. తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా హిందీలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్లో క్యూ కడుతున్న సినిమాలేంటో చూద్దాం..
Bollywood Remakes | ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌లో కథల కొరత ఉంది. దీంతో ఏదైనా భాషలో సినిమా హిట్టైయితే.. వెంటనే ఆయా సినిమాలను వేరే భాషల వాళ్లు రీమేక్ చేయాడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇప్పటికే తెలుగుతో పాటు తమిళంలో హిట్టైన చిత్రాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ‘జెర్సీ’ ‘గద్దలకొండ గణేష్, బాలీవుడ్లో రీమేక్ చేసారు. కానీ ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. (Twitter/Photo)
బచ్చన్ పాండే | అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘బచ్చన్ పాండే’ సినిమా కూడా వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గద్దలకొండ గణేష్’ మూవీకి రీమేక్. ఈ మూవీ తమిళంలో సిద్ధార్ధ్, బాబీ సింహా నటించిన ‘జిగర్తాండ’ మూవీకి రీమేక్. అసలు ఈ సినిమా 2006లో సౌత్ కొరియాలో వచ్చిన ‘ది డర్జీ కార్నివాల్’ అసలు మూవీకి రీమేక్. మొత్తంగా అన్ని భాషల్లో హిట్టైన ఈ సినిమా హిందీలో మార్చి 18న విడుదలై ‘ది కశ్మీర్ ఫైల్స్’ ముందు తేలిపోయింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
జెర్సీ | 2019లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన ‘జెర్సీ’ మూవీని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా అదే టైటిల్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, దిల్ రాజు, అమన్ గిల్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్‌తో మంచి హిట్ అందుకున్న షాహిద్ కపూర్ ఇపుడు ‘జెర్సీ’ తో మరో హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 31న విడుదల కావాల్సింది. కరోనా మూడో వేవ్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ కేజీఎఫ్ 2 కారణంగా ఒక వారం ఆలస్యంగా ఏప్రిల్ 22న థియేటర్స్‌లోకి వచ్చింది. ఇప్పటికే నాని సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉండటంతో పాటు కేజీఎఫ్ 2 దూకుడు ముందు ఈ సినిమా సోదిలో లేకుండా పోయింది. (Twitter/Photo)
ఈ సినిమాను హిందీలో అక్షయ్ కుమార్‌తో ఇమ్రాన్ హష్మి మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. అక్షయ్ కుమార్‌తో ‘గుడ్ న్యూస్’ సినిమాను తెరకెక్కించిన రాజ్ మెహతా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈయన ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ తీసుకున్నారు. వచ్చే యేడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. (Twitter/Photo)
ఖైదీ | తమిళంలో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్లో సూపర్ హిట్టైన ‘ఖైదీ’ చిత్రాన్ని హిందీలో‘ఖైదీ’ టైటిల్‌తో అజయ్ దేవ్‌గణ్ హీరోగా తెరకెక్కుతోంది. హిందీలో పలు మార్పులు చేర్పులతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. హిందీలో ‘భోళా’ టైటిల్‌తో తెరకెక్కుతోంది. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా టబు కూడా ఉంది. (Twitter/Photo)
అల వైకుంఠపురములో: అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సినిమా గతేడాది బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ చిత్రాన్ని హిందీలో కార్తీక్ ఆర్యన్ హీరోగా అల్లు అరవింద్ తెరకెక్కిస్తున్నారు. హిందీలో ‘షెహజాదా’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. అందుకే ‘అల వైకుంఠపురములో’ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను థియేట్రికల్ రిలీజ్ చేయలేదు. (Twitter/Photo)
క్రాక్ | రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే లాభాల్లోకి ప్రవేశించిన ఈ సినిమాను హిందీలో రీమేక్ కోసం మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ హక్కులు భారీ రేటుకు అమ్ముడు పోయింది. హిందీలో అజయ్ దేవ్‌గణ్ లేదా సోనూ సూద్ నటించే అవకాశం ఉంది. (Ravi Teja Krack)
ఇస్మార్ట్ శంకర్ | 2019లో తెలుగులో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను ఇపుడు హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలైయ్యాయి. ఇప్పటికే ‘సింబా’, ‘గల్లీ బాయ్’ వంటి చిత్రాల్లో మాస్ హీరోగా తనకంటూ స్పెషల్ క్రేజ్ ఏర్పరుచుకున్నాడు రణ్వీర్ సింగ్. హిందీ ‘ఇస్మార్ట్ శంకర్’ రీమేక్‌ను పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయి. లేకపోతే వేరే ఎవరైనా డైరెక్ట్ చేస్తారనేది చూడాలి. (Twitter/Photo)
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ | నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం అయింది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం కాన్సెప్ట్ అన్ని భాషల్లో వర్కౌట్ అయ్యేలా ఉండటంతో ఈ చిత్రాన్ని హిందీతో పాటు పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్ర హిందీ రీమేక్‌లో కూడా నవీన్ పొోలీశెట్టి నటించే అవకాశం ఉంది. (Twitter/Photo)
బ్రోచేవారెవరురా | శ్రీ విష్ణు, సత్యదేవ్, నివేదా థామస్, నివేదా పేతురాజ్ నటించిన ‘బ్రోచేవారెవరురా’ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్టు సమాచారం. తెలుగు వెర్షన్ డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమా రీమేక్‌లో సన్ని దేవోల్ కుమారుడు కరణ్ దేవోల్, అభయ్ డియోల్ హీరోగా అజయ్ దేవ్‌గణ్ తెరకెక్కిస్తున్నాడు. (Twitter/Photo)