Sonu Sood: ప్రస్తుతం సోనూసూద్ అంటే తెలియని వారుండరు. కరోనా సమయంలో ఎన్నో వేలమందికి సహాయం చేసిన సోనూసూద్ ను ఎవరూ మర్చిపోలేరు. ఇప్పటికీ కష్టం వచ్చిందంటే చాలు నేను ఉన్న అంటూ ముందుకొస్తున్నాడు. ఇదిలా ఉంటే రెండు రోజుల నుండి సోనూసూద్.. తన పెద్ద కొడుకు ఇషాన్ కు రూ.3 కోట్ల విలువైన లగ్జరీ కార్ ను ఫాదర్స్ డే సందర్భంగా బహుమతి ఇచ్చాడని సోషల్ మీడియాలో వార్తలు హాల్ చల్ చేసాయ్. తాజాగా ఈ విషయం గురించి స్పందించిన సోనూసూద్.. ఇందులో నిజం లేదని తేల్చిచెప్పాడు. తన కొడుకుకు కారు కొనలేదని, కేవలం ట్రయల్ కోసం ఇంటికి తీసుకు వచ్చామని తెలిపారు. అయినా ఫాదర్స్ డే రోజు పిల్లలు తండ్రులకు ఇవ్వాలి కానీ తానెందుకు పిల్లలకు కారును బహుమతి ఇస్తానని అన్నాడు. దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.