ఇద్దరు కలిసి ఫొటో దిగడం.. ఆమె భుజంపై చేయి వేయడం.. పైగా కొత్త ప్రయత్నం అంటూ కాప్షన్ పెట్టడంతో... ఇక నెటిజన్లు రెచ్చిపోయారు. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని ప్రచారం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో క్షణాల్లోనే ఆ ఫొటో వైరల్ అయింది. చాలా మంది కంగ్రాట్స్ అని కూడా కామెంట్స్ పెట్టారు.
ఎస్పీ చరణ్, సోనియాల పెళ్లి అని చాలా మంది భావించారు. కానీ ఈ వార్త వైరల్ కావడంతో.. మరో ఫొటో ద్వారా ఆయన క్లారిటీ ఇచ్చారు. అందులో సోనియాతో పాటు అంజలి, సంతోష్ ప్రతాప్ కూడా ఉన్నారు. ఫిల్మ్ ప్రొడక్షన్, ఇండియన్ వెబ్ సిరీస్ అనే హ్యాష్ టాగ్లు పెట్టడంతో అసలు విషయం అందరికీ అర్థమైంది. వీరితో త్వరలోనే వెబ్ సిరీస్ను నిర్మించబోతున్నారట.