బాలీవుడ్ ప్రముఖ హీరో అనిల్ కపూర్ కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సోనమ్. కొన్ని సినిమాలు తీసినా తండ్రి రేంజ్లో పాపులారిటీ అయితే రాలేదు. దీంతో ఈ భామ త్వరగానే పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను ప్రేమించి పెళ్లాడింది. సోనమ్ కపూర్ 20 ఆగస్టు 2022న తల్లి అయ్యింది. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కొడుకుకి వాయు అని పేరు పెట్టారు ఈ సెలబ్రిటీ కపుల్.