Sonam Kapoor | సినిమా ఇండస్ట్రీలోఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న స్టార్ సెలబ్రెటీలు వారి వారసులను ఇండస్ట్రీలోకి తీసుకు వస్తున్నారు. అయితే ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విధంగా ఎంతో మంది సినీ తారల పిల్లలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అందులో సోనమ్ కపూర్ ఒకరు.. (Image: Instagram)
అనిల్ కపూర్ తనయగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సోనమ్ కపూర్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్లో హీరోయిన్గా మంచి ఊపులో ఉన్న టైమ్‌లో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాను పెళ్లి చేసుకుంది. పెళ్లైనా లేటెస్ట్ ఫ్యాషన్ వేర్లో ఎప్పటి కప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. (Instagram/Photo)
ఈ క్రమంలోనే కెరియర్ మొదట్లో ఎన్నో సినిమాలలో రిజెక్ట్ చేసిన ఈ బ్యూటీ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సావరియా' అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్న ఈమె ‘నీర్జా'సినిమా ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈ సినిమాకు గాను జాతీయ స్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకుంది. (Image: Instagram)
ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో అనతి కాలంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎల్లప్పుడూ తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఈమెను పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తుంటారు. తనపై వచ్చే ట్రోలింగ్స్ అంతగా పట్టించుకోదు. (Image: Instagram)
ఇండస్ట్రీలోకి వచ్చి వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నా ఈమె ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈమె పెళ్లికి సినీ లోకం తరలివచ్చింది. పెళ్లి తర్వాత సోనం కపూర్ పేరును కాస్తా సోనం కపూర్ ఆహుజాగా మార్చుకుంది. పెళ్లి తర్వాత కాస్త సినిమాలకు దూరం అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. (Image: Instagram)
ఫర్హాన్ అక్తర్ హీరోగా రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ భాగ్ మిల్కా భాగ్ చిత్రం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా నేషనల్ అవార్డులు కూడా గెలుచుకుంది. ఈ సినిమాలో సోనమ్ కపూర్ కూడా నటించింది.ఈ సినిమాలో నటనకు కేవలం రూ. 11 రూపాయల పారితోషకం తీసుకుంది. (Image: Instagram)
అప్పట్లో ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమాలో ఓ అతిథి పాత్రలో మెరిసింది ఈమె. దీనికోసం ఈమె కేవలం 11 రూపాయలు మాత్రమే రెమ్యునరేషన్‌గా తీసుకుందని తన ఆత్మకథలో రాసుకొచ్చారు రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా. ది స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్ అనే పుస్తకం రాసాడు మెహ్రా. అందులోనే చాలా విషయాలు పొందు పరిచారు. తాను ఢిల్లీ 6 ఫ్లాప్ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విషయాన్ని కూడా ఆత్మకథలో రాసాడు రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా.(Image: Instagram)
ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ అనిల్ కపూర్ తనయగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సోనమ్ కపూర్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్లో హీరోయిన్గా మంచి ఊపులో ఉన్న టైమ్‌లో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాను పెళ్లి చేసుకుంది. పెళ్లైనా లేటెస్ట్ ఫ్యాషన్ వేర్లో ఎప్పటి కప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. (Instagram/Photo)
పెళ్లి తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించని సోనమ్‌కపూర్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా రెగ్యులర్‌గా ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటోంది. బాలీవుడ్లో చేసింది తక్కువ సినిమాలే అయినా సోనమ్ కపూర్‌కి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆఫ్టర్ మ్యారేజ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఈమెకు ప్రముఖ సోషల్ మీడియాలో ఫ్లాట్‌ఫామ్‌లో 34.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. (Instagram/Photo)