Sonal Chauhan: సోనాల్ చౌహాన్(Sonal Chauhan).. తెలుగులో ఈమె కేరాఫ్ బాలయ్య. ఎందుకంటే ఆయనతో పాటు మూడు సినిమాలు చేసింది సోనాల్. ముందుగా 'లెజెండ్', ఆ తర్వాత 'డిక్టేటర్', ‘రూలర్’ సినిమాలలో నటించింది. లెజెండ్ సినిమా సూపర్ హిట్టైనా కూడా తెలుగులో పెద్దగా అవకాశాలైతే రాలేదు ఈ ముద్దుగుమ్మకు. అయితే వీలున్నప్పుడల్లా బీచ్‌లలో ఫోటోలకు ఫోజ్‌లిస్తూ.. కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. (Instagram/Photo)
ఢిల్లీ భామ సోనాల్ చౌహన్ మరోసారి తన లక్‌ని టాలీవుడ్లో పరీక్షించుకుంటోంది. ది ఘోస్ట్ అనే యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలో కింగ్ నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకుంది. తాజాగా విజయ దశమి సందర్భంగా విడుదలైన ఈ చిత్రంలో తన యాక్షన్ స్టంట్స్‌తో అదరగొట్టేసింది. కానీ ఈ చిత్రానికి అనుకున్నంత రేంజ్లో టాక్ రాలేదు. ఈ సినిమాలో యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాను ఓ వర్గం ప్రేక్షకులు దూరంగా ఉన్నారు. ఈ సినిమా డిజాస్టర్ కావడంలో ఈ అమ్మడి ఆశలపై నీళ్లు చల్లిందనే చెప్పాలి. (Photo Credit:Instagram)
బాలయ్య లెజెండ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు. ఆ తర్వాత డిక్టేటర్ సినిమాలో నటించినా.. ఈ భామకు సక్సెస్ కలిసి రాలేదు. అందుకే ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచి మరీ కుర్రకారును ఊరిస్తోంది. టాలీవుడ్ మన్మధుడు నాగ్‌తో కలిసి ’ది ఘోస్ట్’మూవీతో పలకరించినా.. ఈ అమ్మడికి లక్ కలిసిరాలేదనే చెప్పాలి. (Photo Credit:Instagram)
ట్రెండీ, మోడ్రన్, గాగ్రాచోళీ, లెహంగా, చీరల్లో తళుక్కున మెరిసిన మోడల్ కమ్ యాక్టరస్ రీసెంట్గా తన ఇన్‌స్టా హ్యాండిల్లో కల్చర్డ్ వెడ్డింగ్ మ్యాగజైన్ కోసం లెహంగాతో దిగిన ఫోటోలను షేర్ చేసింది సొనాల్. ఆఫోటోలకు కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. ఇక ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో ఈ భామ లక్ష్మణుడు భార్య ఊర్మిళ పాత్రలో నటించింది. ( Photo Credit:Instagram)
కాస్త వెనుకబడిన మంచి బ్రేక్ కోసం ట్రై చేస్తున్నట్లుగా సోనాల్ చౌహాన్ లేటెస్ట్ పిక్స్ చూస్తే అర్ధమవుతోంది. బాలయ్యతో మూడు సినిమాలు, రామ్ పోతినేనితో ఒక సినిమా చేసిన సోనాల్..నెక్స్ట్ ఇపుడు నాగార్జున సరసన ‘ది ఘోస్ట్’ మూవీలో నటించింది. ముందుగా ఈ పాత్ర కోసం కాజల్ ను తీసుకున్నారు. ఆమె గర్భవతి కావడంతో ఈ పాత్ర నుంచి తప్పుకోవడంతో ఈ రోల్ సోనాల్‌ను వరించింది. ఈ సినిమాలో మాజీ ‘రా’ ఏజెంట్ పాత్రలో తన యాక్షన్ ఎపిసోడ్స్‌తో బాగానే ఫైట్స్ చేసింది. ఈమెలో ఈ యాంగిల్‌ను ప్రవీణ్ సత్తారు కొత్తగా చూపెట్టాడు. (Photo Credit:Instagram)
బాలయ్య తర్వాత ఇపుడు నాగార్జున సరసన నటించిన ఈ భామకు ఈ సినిమాతో హీరోయిన్గా బ్రేక్ వస్తుందనుకుంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ఈ అమ్మడి ఆశలపై నీళ్లు చల్లినట్టైంది. మొత్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం సోనాల్ పడుతున్న తపన అంతా ఇంతా కాదు. మరీ ఈ గ్లామర్ లేడీ ఆరాటం చూసైనా డైరెక్టర్, ప్రొడ్యూసర్లు ఆఫర్లు ఇస్తారో లేదో చూడాలి. (Photo Credit:Instagram)