నాని, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న లేటెస్ట్ సినిమా దసరా. మార్చి 30న విడుదలవుతోన్న ఈ సినిమా నుంచి ఇటీవల చమ్కీల అంగీలేసి ఓ వదినే.. అంటూ సాగే కమ్మని పాట సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఉంగరాల జుట్టుతో.. చమ్కీల అంగీలేసి ఓ వదినే.. చాకు లెక్కుండేటోడే ఓ వదినే.. కండ్లకు ఐనా బెట్టి.. కత్తోలే కన్నెట్ల కొడ్తుండెనే... అంటూ తెలంగాణ యాసలో అక్కడి మట్టివాసన యాదికి వచ్చేలా ఈ పాటను పాడిన ఆ ముద్దుగుమ్మకు బోలెడంత క్రేజ్ వచ్చింది. Photo : Twitter
ఆ లిరికల్ వీడియోలో ఆమె తన గొంతుతో పాటు.. హావ భావాలతో అందరికి ఆకర్షించి అదరహో అనిపించింది. ఇంత చక్కగా ఆలపించిన ఆ ఫీమేల్ సింగర్ ఎవరబ్బా అని నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఎవరు.. ఆమెకు ఈ అవకాశం ఎలా వచ్చిందో చూద్దాం.. ఈ పాటను పాడింది ఓ తమిళ అమ్మాయి. పేరు దీక్షిత.. ధీ అని కూడా అంటారు. Photo : Instagram
గతంలో కూడా కొన్ని తెలుగు పాటలు పాడింది ధీ. తెలుగులో వెంకటేష్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ‘గురు’లోని ‘ఓ సక్కనోడా.. పాట పాడింది ఈ అమ్మాయే. అంతేకాదు ధనుష్, సాయి పల్లవి మారి 2లోని రౌడీ బేబీ పాట పాడింది కూడా ధీనే. ఇక సుధా కొందర దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా ఆకాశమే హద్దురాలోని కాటుక కనులే సాంగ్ కూడా ఈ అమ్మాయే పాడింది. Photo : Instagram
దీక్షిత శ్రీలంకలో పుట్టి, ఆస్ట్రేలియాలో చదువుకుంది. అయితే సంగీతంపై ఉన్న ఇంట్రెస్ట్‌తో 14 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చేసి పాటలు పాడుతోంది. తండ్రి సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన అనేక తమిళ సినిమాల్లో ధీ పాటలు పాడింది. ఇక తెలుగులో కూడా గతంలో పాటలు పాడింది కానీ.. ఒక్క చమ్కీలా అంగీలేసి అనే పాటతో సూపర్ పాపులర్ అయ్యింది ఈ తమిళ పొన్ను. Photo : Instagram
ఇక దసరా విషయానికి వస్తే.. నాచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న లేటెస్ట్ మాస్ యాక్షన్ దసరా. ఈ సినిమాకు కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) డైరెక్షన్ చేస్తున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్గా నటిస్తున్నారు. పాటలు, టీజర్స్, ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈసినిమా మంచి అంచనాలతో విడుదలకు రెడీ అవుతోంది. అది అలా ఉంటే ఈ సినిమాకు బిజినెస్ ఓ రేంజ్’లో జరుగుతోన్న సంగతి తెలిసిందే. Photo : Twitter
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రేంజ్లో ( Dasara theatrical rights ) బిజినెస్ జరిగింది. దిల్ రాజు (Dil Raju)సొంతం చేసుకున్నారు. ఇక లేటెస్ట్గా ఈ సినిమా కన్నడ థియేట్రికల్ రైట్స్‌కు కూడా అదిరిపోయే రేంజ్లో డిమాండ్ ఉందట. ఈ నేపథ్యంలో దసరా రైట్స్‌ను భారీ ధరకు కేజీయఫ్ (KGF) నిర్మాతలు హోంబాలే ఫిల్మ్స్‌కు దక్కించుకుందని తెలుస్తోంది. Photo : Twitter
అది అలా ఉంటే దసరా ఓటీటీ రైట్స్‌కు భారీ ధర పలికినట్లు తెలుస్తోంది. దసరా స్ట్రీమింగ్ రైట్స్‌ను రెండు సంస్థలు దక్కించుకున్నాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలకు చెందిన స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా.. హిందీ స్ట్రీమీంగ్ రైట్స్‌ను హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదలైన ఎనిమిది వారాలకు ఈ రెండు ఓటీటీలో స్ట్రీమింగ్ రానున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈసినిమా క్లైమాక్స్ కోసం ఏకంగా 5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈసినిమాలో పావుగంటపైగా క్లైమాక్స్ ఉంటుందని.. క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్‌తో సాగుతూ.. పాటు ఫైట్స్ ఉంటాయని అంటున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నాని మంచి నమ్మకంతో ఉన్నారు. ఇక ఈసినిమా కోసం నాని 20 కోట్ల రూపాయల రేంజ్లో రెమ్యూనరేషన్ తీసుకున్నారని అంటున్నారు. Photo : Twitter
ఇక ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 20 మిలియన్ వ్యూస్‌ను రాబట్టి కేక పెట్టించింది. ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్ నెటిజన్స్‌కు మంచి కిక్‌ను ఇస్తున్నాయి. మాస్ అండ్ ఇంటెన్స్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. దీంతో నాని సినిమాకు అక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి నాని మొదటి ప్యాన్ ఇండియా సినిమా ఏ రేంజ్లో వసూళ్లను రాబట్టనుందో.. Photo : Twitter
ఇక లేటెస్ట్గా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. చిన్న చిన్న కట్స్‌తో ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చింది బోర్డ్. అంతేకాదు రన్ కూడా లాక్ అయ్యింది. ఈ సినిమా 2 గం. 36 ని. ల నిడివి ఉండనుంది. ఇక ఈసినిమా చూసిన సెన్సార్ సభ్యులు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. దీంతో టీమ్ మరింత సంతోషంగా ఉందని అంటున్నారు. ఈ సినిమాలో నాని ధరణి పాత్రలో నటిస్తున్నారు. Photo : Twitter
కీర్తి సురేష్ వెన్నెలగా కనిపించనుంది. తెలంగాణ సింగరేణి నేపథ్యంలో భారీగా వస్తోన్న ఈ చిత్రాన్ని మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో మూడు అంశాలు సినిమాకి కీలకంగా మారనున్నాయట. తెలుస్తోన్న సమాచారం ప్రకారం దసరా మూవీలో స్నేహం, ప్రేమ, ప్రతీకారం మూడు అంశాలు హైలైట్‌గా ఉండయనున్నాయట. ఈ మూడు ఏమోషన్స్తోనే సినిమాను దర్శకుడు అల్లు కున్నట్లు తెలుస్తోంది. నాని మాస్ సీన్స్‌కు తోడు పలు కీలక సన్నివేశాల్లో కీర్తి సురేష్ యాక్టింగ్ ఆడియన్స్ హృదయాలు తాకుతుందని అని అంటున్నారు. Photo : Twitter
ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే రెండు పాటలు విడుదల్వగా.. లేటెస్ట్గా మరో సాంగ్ విడుదలైంది. చమ్కీల అంగిలేసి.. (Chamkeela Angeelesi ) అనే పాట ఇన్స్టాంట్ హిట్‌గా నిలిచింది. మంచి లిరిక్స్‌తో అదరగొడుతోంది. తెలంగాణ యాస, భాషలతో ఉన్న పాటను కాసర్ల శ్యామ్ రాయగా.. రామ్ మిరియాల, థీ పాడారు. ఈ పాట తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళీ భాషాల్లో కూడా విడుదలైంది. Photo : Twitter
ఇక మరోవైపు ఈ సినిమాకు ఉన్న పాజిటివ్ బజ్‌తో అమెరికాలో ఓరేంజ్‌లో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ దాదాపుగా ఓ 700 లోకేషన్స్‌లో విడుదల కానుందని సమాచారం. దసరా సినిమా అక్కడ అన్ని భాషలతో సహా 700+ లొకేషన్లలో ప్రీమియర్లు పడనున్నాయట. దీంతో నాని కెరీర్లో మొదటి $2M+ సినిమాగా దసరా నిలవనుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. Photo : Twitter
ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. ట్రైలర్’తో దుమ్ములేపిన దసరాకు ఓ రేంజ్లో బిజినెస్ జరుగుతోందట. టీజర్‌తో ఓ రేంజ్లో హైప్ వచ్చిన దసరా చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్‌ను దిల్ రాజు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను దక్కించుకున్నట్లు తాజా సమాచారం. Photo : Twitter
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల రైట్స్‌ను ముందుగా చదలవాడ శ్రీనివాస్ విడుదలకు రెండు నెలల ముందే 24 కోట్ల రేంజ్ రేటుకి సొంతం చేసుకోగా.. ఆయన దగ్గర నుంచి నిర్మాత దిల్ రాజు 28 కోట్ల రేంజ్లో రేటు చెల్లించి దక్కించుకున్నాడని సమాచారం. ఇక సినిమా హిట్ టాక్ వస్తే.. నాని కెరీర్‌లోని బిగ్గెస్ట్ హిట్‌గా దసరా నిలిచిపోనుంది. Photo : Twitter
సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ ఫోటోగ్రఫి. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మార్చి 30న దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా రికార్డు ధరకు అమ్ముడు పోయాయని టాక్. దసరా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ రూ.45 కోట్లు రాబట్టారట. నాని సినిమాల్లో ఇదో రికార్డ్ అని అంటున్నారు. Photo : Twitter
దసరా’ సినిమాకు తెలంగాణకు చెందిన సింగరేణి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న దసరాలో నాని, కీర్తి సురేష్‌తో పాటు మరో కీలకపాత్రలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇతర పాత్రల్లో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కనిపించనున్నారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. Photo : Twitter