తెలుగులో మరిన్ని బయోపిక్స్‌కు శ్రీకారం.. ఓటిటిలోనే వాటికి ముహూర్తం..

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు బయోపిక్స్ అంటే ఏంటి అనేవాళ్లు. ఎందుకంటే ఇక్కడ అలాంటి సినిమాలు రావడం తక్కువే. కానీ మహానటి సాధించిన విజయం చూసిన తర్వాత అలాంటి జీవితాలకు డిమాండ్ పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు వరసగా బయోపిక్స్ వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం ఒకటి రెండు కాదు చాలా బయోపిక్స్ సిద్ధం అవుతున్నాయి. కొన్ని తెరకెక్కుతున్నాయి.. కొన్ని ఇప్పటికే వచ్చేసాయి.. మరికొన్ని ఇప్పుడిప్పుడే స్క్రిప్ట్ పనుల్లో బిజీ అయిపోయాయి.