Allu Sneha Reddy: మిస్ యూ..! అల్లు అర్జున్‌పై స్నేహా రెడ్డి ఎమోషనల్ పోస్ట్
Allu Sneha Reddy: మిస్ యూ..! అల్లు అర్జున్‌పై స్నేహా రెడ్డి ఎమోషనల్ పోస్ట్
Allu Arjun | Sneha Reddy: తాజాగా అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. బన్నీని కౌగిట్లో బంధించిన ఫోటోను షేర్ చేస్తూ మిస్ యూ అని మెసేజ్ పెట్టింది స్నేహా రెడ్డి. ఇన్‌స్టా స్టోరీలో ఆమె పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ అల్లు అర్జున్- స్నేహా రెడ్డి తరచుగా ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తుంటారు. ఏ మాత్రం సమయం దొరికినా భార్యపిల్లలతో బన్నీ టూర్స్ వేయడం, సోషల్ మీడియా వేదికగా వాటి తాలూకు విశేషాలు అల్లు స్నేహారెడ్డి పంచుకుంటూ ఉండటం చూస్తున్నాం.
2/ 8
అయితే తాజాగా అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. బన్నీని కౌగిట్లో బంధించిన ఫోటోను షేర్ చేస్తూ మిస్ యూ అని మెసేజ్ పెట్టింది స్నేహా రెడ్డి. ఇన్‌స్టా స్టోరీలో ఆమె పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
3/ 8
ప్రస్తుతం పుష్ప ది రూల్ షూట్ కోసం వైజాగ్‌లో ఉన్నారు అల్లు అర్జున్. ఆయనకు దూరంగా హైదరాబాద్ లో స్నేహా రెడ్డి ఉంటోంది. ఈ క్రమంలోనే నీ కోసం వేచి చూస్తున్నా డియర్ అని తెలిసేలా అల్లు స్నేహా రెడ్డి ఈ మెసేజ్ పెట్టిందని అంటున్నారు నెటిజన్లు.
4/ 8
పుష్ప సినిమా ఫినిష్ చేశాక షూటింగ్స్ పరంగా కాస్త గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్.. తన ఫ్యామీలీతో ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. బిజీ లైఫ్ లో దొరికిన ఈ కొద్ది సమయాన్ని కుటుంబంతో కలిసి సరదాగా గడిపారు. రీసెంట్ గానే పుష్ప పార్ట్ 2 మొదలు కావడంతో మళ్ళీ బిజీ అయ్యారు బన్నీ.
5/ 8
పుష్ప సీక్వల్ గా పుష్ప-2 సినిమాను రూపొందిస్తున్నారు లెక్కల మాస్టరు సుకుమార్. అనుకున్న సమయానికి కాస్త ఆలస్యమైనా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ రూలింగ్ కనిపించనుందట.
6/ 8
త్వరత్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఫ్యాన్స్‌కు బోలెడన్ని ట్రీట్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. భారీ తారాగణంతో పాన్ ఇండియా ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారట సుకుమార్. వైజాగ్ లో ఇంట్రో సాంగ్ షూట్ చేశారని టాక్.
7/ 8
ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్ ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ కి పాన్ వరల్డ్ క్రేజ్ దక్కేలా పక్కా ప్లాన్ చేసిన సుకుమార్.. ఈ పుష్ప 2 సినిమాను వరల్డ్ క్లాస్ క్వాలిటీతో తెరకెక్కిస్తున్నారట. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి 20కి పైగా దేశాల్లో విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట సుక్కు.
8/ 8
బన్నీ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమాను 2024లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పుష్ప మొదటి భాగంలో శ్రీవల్లిగా కనిపించి యూత్ ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్ రష్మిక మందన్న రోల్ ఈ సినిమాలో మరింత స్పెషల్ కానుందట. అలాగే అనసూయతో ఐటెం సాంగ్ ప్లాన్ చేశారని తెలియడం ఆసక్తికరంగా మారింది.