వైజయంతీ మూవీస్ సమర్ఫణలో మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మాతగా స్వప్న సినిమా పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సీతా రామం’. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ టాక్‌తో బ్లాక్ బస్టర్ అయింది. అంతేకాదు ఓటీటీ వేదికగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంత రాబట్టిందంటే.. Twitter/Photo)
దుల్కర్ సల్మాన్.. ఈ పేరును తెలుగు వారికి ప్రత్యేకంగా ఇప్పుడు పరిచయం చేయాల్సిన అక్కర లేదు. దుల్కర్.. తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సావిత్రి బయోపిక్ మహానటిలో నటించారు. ఈ సినిమాలో ఆయన జెమిని గణేషన్ పాత్రలో నటనతో మెప్పించారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండితెరకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ అనతికాలంలోనే హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఈయన హీరోగా విడుదలైన ఈ సీతారామం సినిమా విమర్శకులు ప్రశంసలు దక్కించుకుంటోంది. (Sita Ramam Ticket Rates Twitter
హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేకపోవడంతో పాటు కుటుం బ సమేతంగా చూసేలా ఉండటంతో ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాసిక్ లవ్ స్టొరీ సీతా రామం బ్రేక్ ఈవెన్‌ని పూర్తీ చేసుకుని అదరగొట్టింది.(Twitter/Photo)
బాక్సాఫీస్ దగ్గర సీతా రామం బాక్సాఫీస్ దగ్గర టోటల్ కలెక్షన్స్ విషయానికొస్తే.. Nizam: రూ. 10.10 కోట్లు, Ceeded: రూ. 2.00 కోట్లు, ఉత్తరాంధ్ర : రూ. 3.63 కోట్లు, East:రూ. 2.03 కోట్లు, West: రూ. 1.29లక్షలు, Guntur:రూ. 1.67 కోట్లు Krishna: రూ. 1.82 కోట్లు Nellore: రూ. 93 లక్షలు. ఇక ఏపీ తెలంగాణలో మొత్తంగా రూ. 23.47 కోట్ల షేర్ (41.75 కోట్ల గ్రాస్)ను అందుకుంది. ఇక కర్నాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ. 2.95కోట్లు, ఇతర భాషల్లో రూ.8.30 కోట్లు, ఓవర్సీస్’లో రూ. 7.30 కోట్లు బట్టింది. వరల్డ్ వైడ్‌గా చూస్తే..రూ. 46.50 కోట్ల షేర్ (రూ. 98.10 కోట్ల గ్రాస్) వసూళ్లు వచ్చాయి. . Photo : Twitter
దుల్కర్ విషయానికొస్తే.. ఈయన తనదైన స్టైల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. రొమాంటిక్ హీరోగా అమ్మాయిల మనసులను దోచుకున్నారు దుల్కర్. తాజాగా ఈయన తెలుగులో చాలా గ్యాప్ తర్వాత మరోసారి ‘సీతా రామం’ సినిమాతో పలకరించబోతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్లో సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వివిధ పాత్రలకు సంబంధించిన లుక్స్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. (Twitter/Photo)
ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మృణాల్ ఠాగూర్ నటించారు. మరో ముఖ్యమైన పాత్రలో రష్మిక మందన్న చేసింది. ఇక ఈ సినిమాతో సుమంత్.. లెఫ్ట్‌నెంట్ కల్నల్ విష్ణు శర్మ పాత్రలో కనిపించనున్నారు. ఈయన భార్యగా భూమిక నటించింది. పైగా నామినల్ టికెట్ రేట్స్ కారణంగా ఈ సినిమాకు చూసేందకు ప్రేక్షకులు థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు. ఈ వారం లైగర్ మూవీకి నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా వసూళ్లు పెరిగే అవకాశాలున్నాయి.(Twitter/Photo)
ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సైనికుడి పాత్రలో ఆకట్టుకున్నారు. కశ్మీర్ విజువల్స్, ఫోటోగ్రఫీ బాగున్నాయి. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ, విశాల్ చంద్రశేఖర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. మొత్తంగా రూ. 16.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం రూ. 17 కోట్ల టార్గెట్‌తో బరిలో దిగింది. ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 29.50 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)