దుల్కర్ సల్మాన్.. ఈ పేరును తెలుగు వారికి ప్రత్యేకంగా ఇప్పుడు పరిచయం చేయాల్సిన అక్కర లేదు. దుల్కర్.. తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సావిత్రి బయోపిక్ మహానటిలో నటించారు. ఈ సినిమాలో ఆయన జెమిని గణేషన్ పాత్రలో నటనతో మెప్పించారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండితెరకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ అనతికాలంలోనే హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఈయన హీరోగా విడుదలైన ఈ సినిమాకు విమర్శకులు ప్రశంసలు దక్కించుకుంటోంది. (Sita Ramam Ticket Rates Twitter
మంచి అంచనాల నడుమ ఆగస్టు 5న వస్తోన్న ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 4 కోట్లు, సీడెడ్ - 1.5 కోట్లు, ఆంధ్రా - 6 కోట్లు మొత్తంగా 11.50 కోట్లుగా ఉంది. కర్నాటకతో రెస్టా ఆఫ్ ఇండియా - 0.70 కోట్లు, ఓవర్సీస్ - 2.5 కోట్లు. ఇతర భాషలు - 1.50కోట్ల వరకు బిజినెస్ చేసిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 16.20 కోట్లు చేయగా.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ. 17 కోట్లు వసూలు చేయాలి. Photo : Twitter
ఇక ఈ సినిమా థియేటర్స్ కౌంట్ విషయానికి వస్తే.. నైజాంలో 115, సీడెడ్ - 50, ఆంధ్ర - 185. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 350 థియేటర్స్‌లో విడుదలవుతోంది. వీటికి తోడు కర్నాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 80 థియేటర్స్, ఇతర భాషలు - 180, ఓవర్సీస్లో 250 పైగా థియేటర్స్. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 860+ థియేటర్స్‌లో ఈ సినిమా విడుదలైంది. Photo : Twitter
దుల్కర్ విషయానికొస్తే.. ఈయన తనదైన స్టైల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. రొమాంటిక్ హీరోగా అమ్మాయిల మనసులను దోచుకున్నారు దుల్కర్. తాజాగా ఈయన తెలుగులో చాలా గ్యాప్ తర్వాత మరోసారి ‘సీతా రామం’ సినిమాతో పలకరించబోతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్లో సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వివిధ పాత్రలకు సంబంధించిన లుక్స్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. (Twitter/Photo)
ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మృణాల్ ఠాగూర్ నటించారు. మరో ముఖ్యమైన పాత్రలో రష్మిక మందన్న చేసింది. ఇక ఈ సినిమాతో సుమంత్.. లెఫ్ట్‌నెంట్ కల్నల్ విష్ణు శర్మ పాత్రలో కనిపించనున్నారు. ఈయన భార్యగా భూమిక నటించింది. పైగా నామినల్ టికెట్ రేట్స్ కారణంగా ఈ సినిమాకు చూసేందకు ప్రేక్షకులు థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు. (Twitter/Photo)