మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండితెరకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ అనతికాలంలోనే హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. దుల్కర్ తనదైన స్టైల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. రొమాంటిక్ హీరోగా అమ్మాయిల మనసులను దోచుకున్నారు దుల్కర్. తాజాగా ఈయన తెలుగులో చాలా గ్యాప్ తర్వాత మరోసారి ‘సీతా రామం’ సినిమాతో పలకరించాడు. (Twitter/Photo) Sita Ramam hindi trailer Photo : Twitter
యుద్ధంతో రాసిన ప్రేమకథగా లవ్, రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో అదరగొట్టే కలెక్షన్స్ తో దూసుకెళుతోంది. రష్మిక మందన్న ముఖ్య పాత్ర చేసిన ఈ మూవీ పై పలువురు ప్రేక్షకులతో పాటు అనేకమంది సినిమా ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.