ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన సీతా రామం సినిమాను చూసిన ప్రేక్షకులు మృణాల్ నటనకు ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ అద్భుతంగా నటించారని.. తను తప్ప మరెవరూ ఈ పాత్రకు న్యాయం చేయలేరని కామెంట్స్ చేస్తూ మెచ్చుకుంటున్నారు. మృణాల్ ఠాకూర్. ఇక ఇది అంతా బాగనే ఉన్నా.. ఒక విషయంలో మాత్రం మృణాల్ ఠాకూర్‌పై ఆమె ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్ మండిపడుతున్నారు. Photo : Instagram
విషయం ఏమంటే.. సీతా రామం సినిమాలో సీత పాత్రలో అందంగా కనిపించిన మృణాల్, సోషల్ మీడియాలో మాత్రం కాస్తా హాటుగా, ఘాటుగా ఫోటోలను షేర్ చేస్తోంది. ఇక ఈ ఫోటోలను చూసిన సీతా రామం సినిమా అభిమానులు, నెటిజన్స్ విమర్శిస్తున్నారు.. ఇదేంటీ.. ఇలా ఫోటోలు ఏంటీ.. అని కామెంట్స్ రూపంలో తమ కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు... Photo : Instagram
సీతా రామం సినిమాతో సూపర్ పాపులర్ అయ్యారు మరాఠి అందం మృణాల్ ఠాకూర్. ఆ సినిమాలో సీతామహాలక్ష్మీగా, మరోవైపు ప్రిన్సెస్ నూర్జహాన్గా మృణాల్ తన నటనతో ఫిదా చేశారు. అది అలా ఉంటే మృణాల్ ఇటీవల ఓ ఇంటర్వూలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా తన ప్రేమ, పెళ్లి గురించి కొన్ని అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పారు. ఆమె పెళ్లి విషయంలో స్పందిస్తూ.. సమాజంలో ప్రతి మహిళను ఇలాంటి ఒక ప్రశ్న వెంటాడుతోనే ఉంటుంది. మహిళ పెళ్లి, ప్రేమ, పిల్లలు వాటిపైనే సమాజం ఆసక్తి చూపిస్తుంది. Photo : Instagram
నేను మాత్రం నన్ను అర్ధం చేసుకొనే వాడినే నేను పెళ్లి చేసుకుంటాను. నేను సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నాను. ఎన్నో సవాళ్లు, ఇబ్బందులు ఉంటాయి.. అలాంటి లైఫ్‌ను అర్ధం చేసుకొనివాడినే నేను వివాహం చేసుకుంటానని తెలపింది. అంతేకాదు ఈ సందర్భంగా పిల్లలపై కూడా మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే.. నాకు పెళ్లి కన్నా ముందు పిల్లల్ని కనాలని ఉంది. ఎందుకో నాకు ప్రేమ మీద మంచి అభిప్రాయం లేదంటూ పేర్కోంది. Photo : Instagram
ఇక ఈ భామ నటించిన సీతా రామం విషయానికి వస్తే.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్స్‌గా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వనీ దత్ నిర్మించిన లేటెస్ట్ సినిమా సీతారామం. ప్యాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన్న, తరుణ్ భాస్కర్, సుమంత్ కీలకపాత్రలో నటించారు. ఆగస్టు 5న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. Photo : Instagram
సీతా రామంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుందీ మరాఠి అందం. మంచి నటనతో ఈ అందాల సుందరి సౌందర్యానికి తెలుగు కుర్రకారు ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమా బంపర్ హిట్ అవ్వడంతో తెలుగులో పెద్ద ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది.. అందులో భాగంగా ఈ భామకు జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివల కాంబినేషన్లో వస్తున్న ఎన్టీఆర్ 30లో హీరోయిన్గా అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. Photo : Instagram
ఎన్టీఆర్ 30 టీమ్ మృణాల్ ఠాకూర్‌ను దాదాపుగా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట. అంతేకాదు ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. తాజాగా సీతారామం సినిమాను నిర్మించిన సంస్థ వైజయంతీ మూవీస్ మరోసారి హీరోయిన్గా మృణాల్‌కు అవకాశం ఇచ్చిందట. ఈ సినిమాలో ఓ కుర్ర హీరో నటించనున్నాడని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. mrunal thakur twitter
అది అలా ఉంటే ఈ సినిమా ఓటీటీలో కూడా విడుదలైంది. ఈ సినిమా ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 9నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా ఈ సినిమా మంచి ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా మృణాల్, దుల్కర్‌లా నటనకు ఫిదా అవుతున్నారు జనాలు. మృణాల్ క్లైమాక్స్‌లో ఇరగదీసిందని అంటున్నారు. Photo : Instagram mrunal thakur twitter
ఇక ఈ సినిమా థియేటర్స్ కౌంట్ విషయానికి వస్తే.. నైజాంలో 115, సీడెడ్ - 50, ఆంధ్ర - 185. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 350 థియేటర్స్‌లో విడుదలైంది. వీటికి తోడు కర్నాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 80 థియేటర్స్, ఇతర భాషలు - 180, ఓవర్సీస్లో 250 పైగా థియేటర్స్. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 860+ థియేటర్స్‌లో ఈ సినిమా విడుదలైంది. Photo : Instagram
ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మృణాల్ ఠాగూర్ నటించారు. మరో ముఖ్యమైన పాత్రలో రష్మిక మందన్న చేసింది. ఇక ఈ సినిమాతో సుమంత్.. లెఫ్ట్‌నెంట్ కల్నల్ విష్ణు శర్మ పాత్రలో కనిపించనున్నారు. ఈయన భార్యగా భూమిక నటిస్తోంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సైనికుడి పాత్రలో ఆకట్టుకున్నారు. కశ్మీర్ విజువల్స్, ఫోటోగ్రఫీ బాగున్నాయి. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ, విశాల్ చంద్రశేఖర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత అందంగా మార్చేశాయి. Photo : Instagram
ఇక ఆమె సినీ కెరీర్ విషయానికి వస్తే.. మృణాల్ ఠాకూర్ 2014లో విడుదలైన మరాఠీ చిత్రం, విట్టి దండుతో సినీ రంగ ప్రవేశం చేశారు. 2012లో, ఠాకూర్ అంతర్జాతీయ చిత్రం లవ్ సోనియాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించి మెప్పించారు. ఇక హిందీలో ఆమె 2019లో వికాస్ బహ్ల్ బయోపిక్ సూపర్ 30 నటించి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. Photo : Instagram