Sirivennela - Puneeth - Mahesh Kathi: సినిమా ఇండస్ట్రీలో వరస విషాదాలు.. 2021లో దూరమైన ప్రముఖులు..

Sirivennela - Puneeth - Mahesh Kathi: ఎందుకో తెలియదు కానీ గత రెండేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో వరస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కోలుకోలేని విధంగా దెబ్బలు పడుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరిగా లెజెండ్స్ కూడా లోకం నుంచి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు సాహిత్య రారాజు సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా అందర్నీ అమావాస్యలో వదిలేసి.. నింగిలోకి వెళ్లిపోయారు.