తెలుగు సినీ సాహితీ సౌరభంలో మరో పద్మం రాలిపోయింది. సీతారామశాస్త్రి మరణంతో తెలుగు సినీ సాహిత్య లోకం మూగబోయిందనే చెప్పాలి. సీతారామశాస్త్రి మరణంపై భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, వైయస్ జగన్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు సహా సినీ ప్రముఖులు అందరు నివాళులు అర్పించారు. సిరివెన్నెల గారు.. .న్యూమెనియాతో ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ (Krishna Institute Of Medical Scinces)లో చికిత్స పొందుతూ నవంబర్ 30న తుదిశ్వాస విడిచారు. Photo : Twitter
ఇక కిమ్స్ హాస్పిటల్లో రెండు రోజుల వైద్యం అందిస్తే సిరివెన్నల గారు బాగానే రికవరీ అయ్యారు. ఇక గత ఐదు రోజుల నుంచి ఆయనకు ఎక్మో మిసన్ పై ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ముందుగా క్యాన్సర్, ఆ తర్వాత బై పాస్ సర్జరీ, ఒబీస్ పెేషెంట్ కావడం, కిడ్నీ ఫెయిల్ అవ్వడంతో పాటు ఇన్ఫెక్షన్ శరీరం మొత్తం సోకింది. దీంతో సిరివెన్నల గారు మంగళవారం సాయంత్రం 04.07 నిమిషాలకు తుది శ్వాస విడిచినట్టు కిమ్స్ హాస్పిటల్ ఎండీ భాస్కరావు మీడియాకు తెలిపారు.