Sirivennala Seetharama Sastry : సీతారామశాస్త్రి పార్ధివ దేహానికి నివాళులు అర్పించిన పవన్, ఎన్టీఆర్, రాజమౌళి..

‘సిరివెన్నెల’ విషయానికొస్తే..  పదాలతో ప్రయోగాలు చేయడం ఆయనకు పెన్నుతో పెట్టిన విద్య.. తెలుగు సినిమా పాటల పూదోటలో విరిసిన ఒకానొక పారిజాతపుష్పం. అక్షరాలనే కిరణాలు, పదాలనే తేజాలను సృష్టించారు. తన పాటలతో అక్షర సేద్యం చేసే కవి కర్షకుడు. అతని పాట ప్రతి నోటా అనేలా ఉంటాయి. అతని రాక తెలుగు సినిమా పాటకు ఏరువాక. సీతారామశాస్త్రి మరణంతో తెలుగు సినీ సాహిత్య లోకం మూగబోయిందనే చెప్పాలి. ఇక హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్‌లో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రాజమౌళి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు.