సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. రీసెంట్గా ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ కన్నుమూసిన కొన్ని రోజులకే కన్నుమూయడం అత్యంత విషాదకరం. గత నెల 24న న్యూమెనియాతో ఆయన హైదరాబాద్లోని కిమ్స్ (Krishna Institute Of Medical Scinces)లో చికిత్స పొందుతూ కాసేటి క్రితమే తుదిశ్వాస విడిచారు. . ఆయన సినీ కెరీర్లో కొన్ని ఆణిముత్యాలు. Photo : Twitter
సిరివెన్నెల సీతారామాశాస్త్రి గత కొన్ని రోజులగా న్యుమోనియాతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే చికిత్స నిమిత్తం ఆయన కిమ్స్ హాస్పిటల్లో చేరిన సంగతి తెలిసిందే కదా. ఆంధ్ర ప్రభ, జ్యోతి లో పడిన ఆయన కవితలు. చిన్నప్పటి నుంచి సాహితి సత్సంగం. ముందుగా గంగావతరణం పేరుతో రచన చేసిన సీతారామశాస్త్రి. అది చూసి విశ్వనాథ్ ఆయనకు రచయతగా అవకాశం ఇచ్చారు.
ఆ తర్వాత సిరివెన్నెల సినిమాతో ఆయన ఇంటిపేరు సిరివెన్నెలగా మారిపోయింది. . ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు ఈ మధ్యకాలంలో . జైలు పక్షి, ఆది దంపతులు, లేడీస్ టైలర్ లాంటి సినిమాలకు కూడా పాటలు రాసారు సీతారామశాస్త్రి. ఆ తర్వాత కే.విశ్వనాథ్ 1986లో తెరకెక్కించిన ‘సిరివెన్నెల’ సినిమాకు అన్ని పాటలను సీతారామశాస్త్రి రాశారు. ఈ సినిమాతో చెంబోలు సీతారామశాస్త్రి కాస్తా సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారారు. ముఖ్యంగా ఆది భిక్షువు వాడిని ఏది కోరేది.. అంటూ ఆయన రాసిన పాటలు ఆయనకు ఎనలేని కీర్తిని తీసుకొచ్చింది. ఈ సినిమాతో తొలి నంది అవార్డును అందుకున్నారు. Photo : Twitter
అయితే సిరివెన్నెల అనే సినిమాతోనే పాపులర్ అవ్వడంతో ఆయన ఇంటిపేరు సిరివెన్నెలగా మారిపోయింది. ఇక అదే సినిమాకు సిరివెన్నెల సీతారామాశాస్త్రికి ఉత్తమ లిరికిస్ట్గా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు వచ్చింది. సిరివెన్నెల కలం నుంచి ఎన్నో అద్భుతమైన తెలుగు సినీ పాటలు వచ్చాయి. విశ్వనాథ్ పిలుపుతో మద్రాసు వెళ్లి రచయతగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. Photo : Twitter
సిరివెన్నెల సీతారామాశాస్త్రి రాసిన శ్రుతిలయలు, స్వర్ణ కమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలకు సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. సిరివెన్నెల మృతితో తెలుగు సినీ పరిశ్రమలో ఒక శకం ముగిసినట్టే. మొత్తంగా తెలుగు సినిమా పాట కుప్పకూలిందనే అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వేటూరి తర్వాత తెలుగు సినిమాలకు అండగా ఉంటారనుకున్నా ఈయన కన్నుమూయడం తెలుగు సిని పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి. Photo : Twitter