అందులో ఏం రాశారంటే.. ‘మీరే జడ్జి చేస్తారు. మీరే ట్రోల్ చేస్తారు. ఎప్పుడూ నన్ను కిందకు లాగడానికి ట్రై చేస్తారు. నేను అభద్రతాభావంలో ఉన్నానని ప్రూవ్ చేయాలని అనుకుంటారు. నన్ను మీరు నమ్మరు. నాకు సపోర్ట్ చెయ్యరు. నా మాట ఎప్పుడూ వినలేదు. నేను పడిపోయినప్పుడు మీరు నవ్వారు. నన్ను ఒత్తిడికి గురి చేశారు. సంబంధం లేకుండా నా మీద నిందలు వేశారు. ఇప్పుడు నాకు హ్యాపీ ఉమెన్స్ డే చెబుతున్నారు.’ అని రాశారు. (Singer Sunitha Ram Veerapaneni)
సింగర్ సునీత అంతటితో ఆగలేదు. ఇంకా కొనసాగించారు. ‘ఔను. మీ విషెస్‌ను నేను తీసుకుంటా. ఎందుకంటే మీరు నా మీద విసిరిన రాళ్లను పునాదిగా మార్చుకుని సౌధాన్ని నిర్మించుకున్నా. అలా నా ఎదుగుదలకు తోడ్పడ్డారు. నేను నవ్వుతాను. నేను క్షమిస్తా. నేను కేర్ చేస్తా. నేను ప్రేమిస్తా. నేనెప్పుడూ వదిలేయలేదు. నేను మహిళను. అన్నిటినీ సహించారు. హ్యాపీ ఉమెన్స్ డే.’ అంటూ ముగించారు.