ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. కొందరు మాత్రం అలాగే దశాబ్ధాల పాటు కలిసుంటున్నారు కానీ మరికొందరు మాత్రం కొన్నేళ్లకే విడిపోతున్నారు. అలా తమ జివిత భాగస్వాములకు విడాకులు ఇచ్చిన ఫిల్మ్ సెలబ్రిటీలు ఇంకెవరున్నారో మీరు ఓ లుక్కేయండి..(File/Photos)
సీనియర్ నటి జయంతి కూడా మొదట తన తోటి నటుడు దర్శకుడు పేకేటి శివరాంను ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంది. ఆ తర్వాత బంగారు గిరిబాబును రెండోె పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తనకన్నా 25 ఏళ్ల చిన్నవాడైనా ప్రముఖ దర్శకుడు రాజశేఖర్‌ను మూడో వివాహాం చేసుకుంది. మొత్తంగా ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చిన తర్వాత మరో బంధంలోకి అడుగుపెట్టింది. (actress Jayanthi)