Singer Sunitha: టాలీవుడ్ సింగర్ సునీత ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా మారింది. నిత్యం ఫోటోల షేర్ లతో అభిమానులకు మరింత దగ్గరయ్యింది. ఏమైంది ఈ వేళ పాటతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక కొన్ని రోజుల కిందట రెండో పెళ్లి చేసకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. తన భర్తతో దిగిన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది. ఇక తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో పంచుకుంది. అందులో తన ఇంటి ఆవరణలో నిల్చొని సాయంకాల సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది.