సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆమె తెలుగులో పాపులర్ సింగర్ అని తెలిసిందే. సునీత నేపథ్య గాయని మాత్రమే కాదు డబ్బింగ్ కళాకారిణి కూడా. సునీత గుంటూరులో పుట్టి పెరిగారు. విజయవాడలో విద్యాభ్యాసం చేశారు సునీత. ఇక సునీత కెరీర్ విషయానికి వస్తే.. ఆమె మొదట్లో టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా చేశారు. Photo : Instagram
సునీత 15 సంవత్సరాల వయసులో చిత్ర పరిశ్రమకు సింగర్‌గా ఎంట్రీ ఇచ్చారు. సునీతకు గులాబి, ఎగిరే పావురమా వంటి సినిమాల్లో పాడిన పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. సునీత ఇప్పటి వరకు దాదాపుగా 500 సినిమాలకు డబ్బింగ్ చెప్పారని తెలుస్తోంది. సునీతకు శశి ప్రీతమ్ సంగీత దర్శకత్వంలో వచ్చిన గులాబి సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన "ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు" అనే పాట సూపర్ క్రేజ్‌ను తెచ్చింది. సునీత తెలుగుతో పాట కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు 3,000 సినిమా పాటలు పాడిందని తెలుస్తోంది. Photo : Instagram
Singer Sunitha photos: బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేని (Ram Veerapaneni)ని పెళ్లి చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు సునీత. ఈ విషయం ఆమెను చూస్తుంటేనే అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కొత్త కొత్త ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తూనే ఉంటారు సునీత. తాజాగా చిరునవ్వులు చిందిస్తూ చీరకట్టులో ఫోజులిచ్చి అభిమానుల మతులు పోగొట్టారు. (Instagram/Photo)
సింగర్ సునీత గురించి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్లకు ఉన్న క్రేజ్ ఈమె సొంతం. కొన్ని నెలలుగా సునీత పేరు సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతుంది. దానికి కారణం ఈమె రెండో పెళ్ళి. సునీత తీసుకున్న ఈ నిర్ణయంతో ముందు ఫ్యాన్స్ కాస్త కంగారు పడినా కూడా తర్వాత అర్థం చేసుకున్నారు. కొత్త జంటను ఆశీర్వదించారు.(Instagram/Photo)
నిజం చెప్పాలంటే తెలుగులో చాలా మంది సింగర్స్‌కు లేని ఇమేజ్ సునీత సొంతం. పాటలు పాడినా పాడకపోయినా కూడా తన అందంతోనే ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది సునీత. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తుంది సునీత. దాంతో పాటు ఫోటోషూట్స్ కూడా క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తుంది. (Instagram/Photo)
తాజాగా మరోసారి ఇదే చేసింది. ఈమె ఫోటోషూట్ పోస్ట్ చేసిన ప్రతీసారి వ్యూస్ కూడా అలాగే వస్తుంటాయి. ఎక్కడ పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి. తాజాగా మామిడి తోటలో పండ్లతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో సునీత గర్భవతి అన్న వార్తలు గుప్పు మన్నాయి. అయితే వాటిని సునీత మాత్రం తోసిపుచ్చారు. (Instagram/Photo)
ప్రస్తుతం సునీత తన భర్తకు సంబంధించిన మ్యాంగో వీడియోస్‌కు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలతో పాటు తన కెరీర్‌ను చూసుకుంటోంది. మరో వైపు సినిమాల్లో పాటలు పాడుతూనే.. మరోవైపు పాడుతా తీయగా వంటి రియాల్టీ షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. ఈ రియాల్టీ షోకు బాలు తనయుడు చరణ్‌తో పాటు సునీత, చంద్రబోస్ సహా పలువురు జడ్జెస్‌గా వ్యవహరిస్తున్నారు. (Instagram/Photo) (Instagram/Photo)