కన్నడలో లేటెస్ట్ వచ్చిన సినిమా.. దీని గురించే చర్చ.. రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన ఈ కన్నడ సినిమా కన్నడలో కంటే తెలుగులో మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విడుదల చేశారు. అక్టోబర్ 15వ తేదీన విడుదలై ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. Photo : Twitter
ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ‘వరాహరూపం’ పాట కాపీ రైట్స్ వివాదంలో చిక్కుకుంది. ఈ పాట తమ పాట నుంచి కాపీ కొట్టారంటూ తైక్కుడం బ్రిడ్జ్ ఆల్బమ్ టీమ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయ స్థానం ఈ పిటీషన్ ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. ఈ మేరకు వరహ రూపం పాట మీద ఉన్న బ్యాన్ ను న్యాయస్థానం ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ‘కాంతార’ ఓటీటీ వెర్షన్ లోనూ అప్ డేట్ అయ్యింది.