Home » photogallery » movies » SILVER SCREEN CHIEF MINISTERS CM BALAKRISHNA MAHESH BABU VIJAY DEVARAKONDA RANA DAGGUBATI KANGANA RANAUT THALAIVI MANY TOLLYWOOD ACTORS WHO PLYED CM CHARECTERS TA

Silver Screen Chief Ministers: బాలయ్య, మహేష్ బాబు, రానా, కంగనా సహా వెండితెరపై ముఖ్యమంత్రి పాత్రల్లో అలరించిన హీరోలు..

Silver Screen Chief Ministers | మన దగ్గర సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. అక్కడి వాళ్లు ఇక్కడ.. ఇక్కడి వాళ్లు అక్కడ రావడం అనేది ఎప్పట్నుంచో జరుగుతున్న పనే. ముఖ్యంగా సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం పెద్ద విశేషం కాదు.తెలుగు నాట అన్న ఎన్టీఆర్ తెలుగు దేశం అనే రాజకీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంచలనం సృష్టించారు. ఐతే.. రియల్ లైఫ్‌ లో సీఎం అయిన ఎన్టీఆర్...రీల్ లైఫ్‌ లో ఆ క్యారెక్టర్ చేయలేకపోయారు. కానీ ఆయన సమకాలీన నటులు...ఆ తర్వాత తరం వారు ముఖ్య మంత్రి పాత్రలో అలరించారు. ఇంతకీ వెండితెరపై ముఖ్యమంత్రిగా అలరించిన నటీనటులెవరున్నారో ఓ లుక్కేద్దాం.