అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో అసలు సిల్క్ స్మిత మ్యాటర్ ఏంటి అని అడగగా.. తన చిన్ననాటి సంఘటనని శ్రీకాంత్ ఓదెల వివరించాడు. తన తాత సింగరేణి కార్మికుడిగా పనిచేస్తుండేవారట. ప్రమాదంలో ఆయన కాలు విరిగిపోయింది. ఆ తర్వాత ఆయనకి కల్లు, మద్యం అవసరం అయితే శ్రీకాంత్ వెళ్లి తీసుకువచ్చేవాడట. ఒకసారి చిన్నతనంలో కల్లు దుకాణంకి వెళితే అక్కడ సిల్క్ స్మిత పోస్టర్ కనిపించడంతో ఆమె లుక్ చిన్నతనంలోనే శ్రీకాంత్ ని బాగా ఆకర్షించిందట.