మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా తన సోషల్ మీడియాలో తోటి నటి కియారాకు బెస్ట్ విషెస్ తెలిపారు. హీరోయిన్ కియారా, హిందీ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను నిన్న ఘనంగా పెళ్లి చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు సెలెబ్రిటీలు, ముఖ్యంగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అందులో భాగంగా రామ్ చరణ్, కియారాకు విషెస్ తెలిపారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాస్తూ.. కియారా, సిద్ధార్థ్‌ల పెళ్లి స్వర్గంలో నిర్ణయించబడిందని.. అని ఇద్దరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ తెలిపారు. Photo : Instagram
ఇక మరోవైపు కియారాకు ఆమె అభిమానులు కూడా కంగ్రాట్స్ చెబుతున్నారు. ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం కియారా, రామ చరణ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. శంకర్ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇక ఇదే కాంబోలో గతంలో వినయ విధేయ రామ చిత్రం వచ్చింది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. Photo : Instagram
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత చరణ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్‌తో కలిసి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తోన్నసంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు.. కియారా అద్వానీ హీరోయిన్గా చేస్తున్నారు. కొన్నాళ్లు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన టీమ్ ఇక షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది.. Photo : Twitter
ప్రస్తుతం ఓ పాటను చిత్రీకరిస్తుందట చిత్రబృందం. ఈ పాటకు దాదాపుగా 5 కోట్లపైగా ఖర్చు చేస్తున్నాట. ఈ పాట షూటింగ్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. ఇక గతంలో కూడా ఓ పాట కోసం దాదాపుగా రూ.15 కోట్ల ఖర్చు చేశారని సమాచారం. ఈ విషయంపై నెటిజన్స్ స్పందిస్తూ.. రెండు పాటలకు పెట్టే ఖర్చు ఓ మీడియం బడ్జెట్ సినిమా తీయోచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Photo : Twitter
ఇక శంకర్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోయేసినిమా విషయంలో ఓ క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ 16 సినిమాను యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో చేయనున్నారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో రానుంది. దీని కోసం ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట దర్శకుడు బుచ్చిబాబు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. Photo : Twitter
రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో అదరగొట్టారు. ఈ చిత్రం 2022 మార్చి 24 విడుదలై వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇక థియేట్రికల్ రన్ పూర్తి అవ్వడంతో ఈ సినిమా జీ5తో పాటు నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇక మరోవైపు ఈ సినిమా జపాన్‌లో అక్టోబర్ 21, 2022 న విడుదలై అక్కడ కూడా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. Photo : Twitter
RC15 విషయానికి వస్తే.. ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో ఓ కీలకమైన పాత్రలో నటి ఖుష్బూ కనిపించనుందని తెలుస్తోంది. ఈ పాత్ర ఈ సినిమా మొత్తంలోనే చాలా కీలకం అని సమాచారం. దీంతో ఆ పాత్ర కోసం ఖుష్బూను ఎంపిక చేశారట శంకర్. ఇక ఈ సినిమాలోనే ప్రధాన హైలైట్.. రామ్ చరణ్ డ్యుయల్ రోల్లో కనిపించనున్నారు. వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా కనిపంచనుండగా.. మరో పాత్రలో సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. Photo : Twitter
ఈ సినిమాలో ఓ ఖతర్నాక్ సాంగ్ ఉందని.. ఆ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇరగదీశారని అంటున్నారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఆ పాటకు తానే కొరియోగ్రఫి చేశానని.. పాట మామూలుగా ఉండదని అన్నారు. డైరెక్టర్ శంకర్ సూచనల మేరకు అదిరిపోయే రేంజ్లో చిత్రీకరణ జరిగిందని.. తెలిపారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా విషయంలో మొదటి నుంచి లీకులు మాత్రం తప్పడం లేదు. ఇప్పటికే ఓ వీడియో, ఫోటోలు లీక్ అవ్వగా.. ఇక తాజాగా మరికొన్ని లీక్ అయ్యినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. షూటింగ్ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని సార్లు హెచ్చరించినా కూడా కొన్ని ఫోటోలు లీక్ అవుతున్నాయి. Photo : Twitter
గతం రామ్ చరణ్ రిక్షా తొక్కుకుంటూ తెల్లని దుస్తుల్లో ఒక కామన్ మ్యాన్ కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇక మరో ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మాత్రం పంచ కట్టులో తన భార్య కొడుకుతో కనిపిస్తూ ఉన్నారు. ఈ ఫోటోను బట్టి చూస్తుంటే.. రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్‌లో తండ్రిగానూ అలాగే ఆ తర్వాత కొడుకు గానూ కనిపిస్తాడని, రెండు పాత్రల్లో చరణ్ నటిస్తున్నారని తెలుస్తోంది. ఇక అంజలి ఈ సినిమాలో సీనియర్ రామ్ చరణ్‌కు భార్య పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. Photo : Twitter
భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో దర్శకుడు. నటుడు ఎస్ జే సూర్య నటించనున్నారట. దీనికి సంబంధించి టీమ్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ భారీ సినిమాలో చరణ్ సరసన హిందీ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. Photo : Twitter
ఈ సినిమాకు ఓవర్సీస్లో భారీ డిమాండ్ పలుకుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి అన్ని భాషల్లో కలిపి ఓవర్సీస్ రైట్స్ కోసం 45 కోట్లకి పైగానే చెల్లించేందుకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రెడీగా ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా గురించి మరో రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం ఏమంటే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. Photo : Twitter
ముందుగా ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ పేరు వినిపించింది. తర్వాత ఇప్పుడు అధికారి అంటున్నారు. ఈ సినిమా హీరో ఎలక్షన్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. మరోవైపు సీఎం పాత్రలో ఎస్.జే.సూర్య నటిస్తున్నట్టు సమాచారం. వీళ్లిద్దరి మధ్య ఆసక్తికర సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పలు సెక్షన్లను శంకర్ ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం. Photo : Twitter
సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ (Kollywood) సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. Photo : Twitter