ఈ సినిమా ఫిబ్రవరి 12న విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ తోనే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. అంతేకాదు అటు ఓవర్సీస్లో కూడా మంచి కలెక్షల్స్ను రాబట్టింది. ఈ సినిమా అక్కడ 65 లక్షల రేంజ్ లో బిజినెస్ చేయగా.. ప్రీమియర్స్‌తో పాటు ఫస్ట్ డే 1 కలెక్షన్స్ తో అమెరికాలో 200K డాలర్స్ మార్క్ ని అందుకోని అదరగొట్టింది. Photo : Twitter
అది అలా ఉంటే ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా స్టార్ మాలో ప్రసారం అయిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సంబంధించిన టీఆర్పీ వచ్చింది. ఈ చిత్రం అర్బన్ ఏరియాలో 10.83 టీఆర్పీని రాబట్టగా, అర్బన్, రూరల్ ప్రాంతాల్లో కలిపి 8.41 రేటింగ్ తెచ్చుకుంది. ఓ చిన్న సినిమాకు ఈ రేంజ్లో రేటింగ్ అంటే మామూలు విషయం కాదు అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను ఆహా ఫ్యాన్సీ ధరకు దక్కించుకుంది. ప్రస్తుతం డీజే టిల్లు ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. Photo : Twitter
ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్, టీసర్, ట్రైలర్ అన్నీ యూత్‌ని ఆకట్టుకున్నాయి. దీంతో పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ సినిమాకు భారీ లెవల్లో బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఆ వివరాలను ఒకసారి చూస్తే.. ఈ సినిమాకు నైజాంలో 2.80 కోట్లు, సీడెడ్‌లో 1.50 కోట్లు, ఆంధ్రాలో 3.40 కోట్లు, మొత్తంగా ఏపీ తెలంగాణలో 7.70 కోట్ల వరకు బిజినెస్ జరిగిందిని అంటున్నారు. Photo : Twitter
మాంచి మాస్ అంశాలతో తెలంగాణ యాసలో వచ్చిన ఈ సినిమాలో టైటిల్ సాంగ్ డీజే టిల్లు పాటకు ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణ యాసలో సిద్ధు జొన్నలగడ్డ ఇరగదీశారు. ఇప్పటికే విడుదలైన లుక్స్, టీజర్ అన్ని కూడా మంచి ఆదరణపొందాయి. దీనికి తోడు సిద్ధూ యాటిట్యూడ్, హీరోయిన్ అందచందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. Photo : Twitter
ఇక ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డకు జోడిగా నేహా శెట్టి హీరోయిన్గా చేశారు. ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా ఫిబ్రవరి 12న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమాలో రామ్ మిర్యాల పాడిన (DJ Tillu )డీజే టిల్లు సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. Photo : Twitter