సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా డీజే టిల్లు. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మరీ ముఖ్యంగా నైజాంలో దుమ్ము దులిపేసింది డిజే టిల్లు. ఇప్పటికీ మంచి వసూళ్లనే తీసుకొస్తుంది టిల్లు. అదే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వచ్చిన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాకు టికెట్లు దొరకని వాళ్లకు డిజే టిల్లు మంచి ఆప్షన్ అయింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఓటిటి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిందిప్పుడు.
బాక్సాఫీస్ దగ్గర టిల్లు రీ సౌండ్ కొనసాగుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డిజే టిల్లు (DJ Tillu) బ్లాక్‌బస్టర్ అయిపోయింది. ఈ సినిమాకు కొన్న ప్రతీ ఒక్క డిస్ట్రిబ్యూటర్ లాభాల్లోకి వచ్చేసాడు. నాలుగో రోజు నుంచి లాభాల పంట పండుతుంది. సినిమాలో కామెడీగా బాగా పేలడంతో థియేటర్స్ దగ్గర ఆడియన్స్ బాగానే కనిపిస్తున్నారు. రెండు వారాల తర్వాత కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ మోత మోగింది.
ఇప్పటికీ చెప్పుకోదగ్గర వసూళ్లు తీసుకొస్తున్నాడు డిజే టిల్లు. ముఖ్యంగా మాస్ సెంటర్స్‌లో డిజే టిల్లు రీ సౌండ్ అదిరిపోతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ రప్ఫాడిస్తున్నాడు డిజే టిల్లు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే హీరో సిద్దు జొన్నలగడ్డే అందించాడు (Sidhhu Jonnalagadda). తన స్నేహితుడు విమల్ కృష్ణ (Vimal Krishna)తో కలిసి కథ, స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. దర్శకుడిగా మాత్రం విమల్ ఉన్నాడు.
నరుడి బతుకు నటన నుంచి ఈ సినిమా టైటిల్‌ను డిజే టిల్లుగా మార్చేసారు. నవ్వుకోడానికి టిల్లు ఫుల్ టైమ్ పాస్ అని టాక్ రావడంతో వసూళ్ల పంట పండుతుంది. ఓవర్సీస్ సహా ఇండియాలో కూడా దుమ్ము దులిపేస్తున్నాడు టిల్లు. రవితేజ ఖిలాడి సినిమాకు ఊహించిన టాక్ రాకపోవడంతో మొదటి రోజే తేలిపోయింది ఇది. దాంతో టిల్లు రప్ఫాడిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో డిజే టిల్లు సినిమాకు ఇప్పటివ రకు 14 కోట్లు షేర్ వచ్చింది.
ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్‌కు.. ఉన్న అంచనాలకు.. చేసిన బిజినెస్‌కు.. వచ్చిన కలెక్షన్స్‌కు ఎక్కడా పొంతన లేదు. డిజే టిల్లు సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ఈ చిత్రాన్ని 8.50 కోట్లకు పైగా బిజినెస్ చేసారు. కానీ ఆ మొత్తాన్ని కేవలం 4 రోజుల్లోనే చేరుకుంది ఈ సినిమా. బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడమే కాకుండా లాభాల పంట పండిస్తుంది డిజే టిల్లు.
ముఖ్యంగా ఓవర్సీస్లో భీమ్లా నాయక్ వచ్చే వరకు కూడా 2022 బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది డిజే టిల్లు. హాఫ్ మిలియన్ మార్క్ అందుకుని చిన్న సినిమాల సత్తా చూపించింది టిల్లు. ఈ సినిమా ఓటిటి రైట్స్ ఆహా తీసుకుంది. మార్చ్ 4 నుంచి ఈ మాస్ సినిమాను అక్కడ ప్రదర్శించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఆహా టీమ్.