Prabhas: ప్రభాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. ఇండియన్ సినీ హిస్టరీలోనే భారీ స్కెచ్!
Prabhas: ప్రభాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. ఇండియన్ సినీ హిస్టరీలోనే భారీ స్కెచ్!
Prabhas | Hrithik Roshan: ఇప్పటికే పలు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ లో భాగమవుతూ బిజీ బిజీగా ఉన్న ప్రభాస్‌తో ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేశారట పఠాన్ మూవీ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand). బలమైన కథతో ప్రభాస్ హీరోగా ఇండియన్ సినీ హిస్టరీలో ఎన్నడూ లేనివిధంగా ఈ మూవీ తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.
బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ క్రేజ్ అందుకున్నారు టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులతో అన్ని భాషా ప్రేక్షకుల్లో ప్రభాస్ పేరు మారుమోగింది. దీంతో ఆ తర్వాత వరుసపెట్టి బిగ్గెస్ట్ ఆఫర్స్ అందుకుంటున్నారు ఈ హీరో.
2/ 8
ఇప్పటికే పలు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ లో భాగమవుతూ బిజీ బిజీగా ఉన్న ప్రభాస్‌తో ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేశారట పఠాన్ మూవీ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand). బలమైన కథతో ప్రభాస్ హీరోగా ఇండియన్ సినీ హిస్టరీలో ఎన్నడూ లేనివిధంగా ఈ మూవీ తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.
3/ 8
ఈ బిగ్గెస్ట్ సినిమాలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించనున్నట్లు తెలుస్తుండటం ఆసక్తికరం. అతి త్వరలో ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నట్లు టాక్. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు సమాచారం.
4/ 8
ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రభాస్- హృతిక్ రోషన్ మల్టీస్టారర్ తెరకెక్కనుందని అంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే మైత్రి నిర్మాతలతో సిద్దార్థ్ ఆనంద్ సిట్టింగ్స్ నడుస్తున్నాయని ఇన్ సైడ్ టాక్. 2024లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉందని అంటున్నారు.
5/ 8
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో బిగ్గెస్ట్ సినిమాలున్నాయి. కెజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ చేస్తున్నారు ప్రభాస్. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.
6/ 8
తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా యాక్షన్ సీన్స్ షూట్ చేశారట ప్రశాంత్ నీల్. వరుస సినిమాలు లైన్ లో ఉన్నప్పటికీ సలార్ కోసం ప్రభాస్ కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్.
7/ 8
అదేవిధంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాను ఇప్పటికే కంప్లీట్ చేశారు ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే వదిలిన ఆదిపురుష్ అప్డేట్స్ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో స్పష్టం చేశాయి. ఈ మూవీపై రెబల్ స్టార్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
8/ 8
అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమాను లైన్ లో పెట్టిన ప్రభాస్.. రీసెంట్ గానే మారుతి దర్శకత్వంలో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ కూడా చకచకా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్నాయి.