నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో (Shyam Singha Roy) ‘శ్యామ్ సింగ రాయ్’ అనే పీరియాడిక్ డ్రామా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. దీంతో టీమ్ తాజాగా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. అందులో భాగంగా ఈసినిమాలో పనిచేసిన టెక్నిషియన్స్‌కు మెమెంటోలను అందచేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo : Twitter
క ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. థియేటర్స్ తక్కువుగా ఉన్నా స్థిరమైన కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు అమెరికాలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ చిత్రం అక్కడ 6 లక్షల యూఎస్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసింది. Photo : Twitter
దీంతో దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అంతే కాకుండా అదనంగా 20 కొత్త థియేటర్స్ యాడ్ చేశారట. దీంతో అక్కడ రెండో వారంలో శ్యామ్ సింగ రాయ్ చిత్రం మొత్తంగా 200 థియేటర్స్ లో ప్రదర్శితం అవుతున్నట్టు వారు తెలిపింది టీమ్. కలకత్తా నగరం నేపథ్యంలో వింటేజ్ డ్రామాలా సాగిన ఈ శ్యామ్ సింగరాయ్ క్లాసిక్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. Photo : Twitter
ఈ సినిమా 4వ రోజు 1.38 కోట్ల షేర్ ని సాధిస్తే 5వ రోజు మాత్రం కేవలం 74 లక్షల షేర్ తోనే సినిమా సరిపెట్టుకుంది. ఈ సినిమా 22.5 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగగా.. ఇంకా 2.56 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండనుందో.. నాని ఈ సినిమాలో శ్యామ్‌సింగ రాయ్, వాసు అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి,(Sai Pallavi ) కృతి శెట్టి (Krithi Shetty) లతో పాటు మరో టాలెంటెడ్ బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా ఓ కీలకపాత్రలో కనిపించారు. Photo : Twitter
కెరీర్ లోనే అత్యధికంగా 50 కోట్లతో నిర్మించారు." width="4096" height="2831" /> ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ (Netflix) భారీ ధర చెల్లించి దక్కించుకుందని తెలుస్తోంది. అయితే థియేటర్లలో సినిమా విడుదల అయిన అనంతరం నెట్ ఫ్లిక్స్ లో శ్యామ్ సింగ రాయ్ స్ట్రీమ్ కానుంది. దాదాపు 8 కోట్లు పెట్టి నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను పొందిందని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి ఎంతో గ్రాండ్‌గా నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధికంగా 50 కోట్లతో నిర్మించారు. Photo : Twitter