SHRUTI HAASAN TALKED ABOUT TOLLYWOOD HEROES LIKE PAWAN KALYAN JR NTR ALLU ARJUN IN HELO TA
పవన్, ఎన్టీఆర్ సహా టాలీవుడ్ హీరోలపై శృతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
నిన్నమొన్నటి వరకు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్...పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘కాటమరాయుడు’ సినిమా తర్వాత తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. చాలా గ్యాప్ తర్వాత ఈ భామ.. తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం శృతి హాసన్ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో నటిస్తోంది. ఈ సందర్భంగా శృతి హాసన్ ప్రముఖ సోషల్ మీడియా యాప్ హలోలో టాలీవుడ్ హీరోలతో పాటు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌లో నటించే విషయమై పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
పవన్ కళ్యాణ్‌తో గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాల్లో నటించిన శృతి హాసన్.. పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇపుడే ఈ సినిమా గురించి మాట్లాడనని దాట వేసింది. (Twitter/Pjhoto)
3/ 12
పవన్ కళ్యాణ్ గురించి ఒక వర్డ్‌లో చెప్పమంటే..ఆయన అమేజింగ్ యాక్టర్ కమ్ హ్యూమన్ బీయింగ్ అంటూ చెప్పుకొచ్చింది. (Twitter/Photo)
4/ 12
కాటమరాయుడు సినిమాలో మరోసారి పవన్ కళ్యాణ్‌తో నటించిన శృతి హాసన్ (Twitter/Photo)
5/ 12
అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ..ఆయనతో పనిచేయడం మరిచిపోలేని అనుభూతి అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు నా ఫేవరేట్ కో స్లార్. వీళ్లిద్దరు రేసు గుర్రం సినిమాలో కలిసి నటించారు. (Twitter/Photo)
6/ 12
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ.. ఆయనో పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అంటూ వ్యాఖ్యానించింది. శృతి.. మహేష్ బాబుతో శ్రీమంతుడు సినిమాలో కలిసి నటించింది. (Twitter/Photo)
7/ 12
రవితేజ సో స్పెషల్. ఆయనతో రెండోసారి కలిసి ’క్రాక్’ పనిచేస్తున్నాను. ఆయనెంతో హంబుల్‌గా ఉంటాడని చెప్పుకొచ్చింది. ఎంతో జోవియల్‌గా ఉంటారని చెప్పుకొచ్చింది. (Twitter/Photo)
8/ 12
జూనియర్ ఎన్టీఆర్‌తో శృతి హాసన్.. ’రామయ్యా వస్తావయ్య’ సినిమా చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆయన నైస్ పర్సన్ అంటూ చెప్పుకొచ్చింది. (Twitter/Photo)
9/ 12
తనకు ఎప్పటికీ తన తండ్రి కమల్ హాసనే ఫేవరేట్ హీరో అని చెప్పింది. అంతేకాదు సినిమాల్లోకానీ, మిగతా విషయాల్లో కానీ ఆయన అండదండలు అందించారంది. (Twitter/Photo)
10/ 12
లాక్డౌన్ ఇంట్లో వంటలు రకరకాల వంటలు చేయడం నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. (Twitter/Photo)
11/ 12
అంతేకాదు చిన్నపుడు నాన్న యాక్ట్ చేసిన సినిమాలోని డాన్సులు, యాక్టింగ్,డైలాగులు చెప్పడం నాకు హాబీ అంటూ చెప్పుకొచ్చింది. ( Photo : Twitter)
12/ 12
శృతి హాసన్.. మంచి నటే కాదు.. ఆమెలో మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉంది. ఆమె పలు సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేసిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు పలు సినిమాల్లో పాటలు కూడా పాడింది. ఇప్పటికే ఛాన్స్ వస్తే.. తెలుగులో కూడా పాటలు పాడతానని చెప్పుకొచ్చింది. (Twitter/Photo)