టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్... ప్రస్తుతం కొంత గ్యాప్ తర్వాత తెలుగులో నటిస్తోంది. గతేడాది రవితేజ సరసన క్రాక్‌లో ఈ భామ అదరగొట్టింది. ఆ తర్వాత శృతి హాసన్ తెలుగులో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో మెరిసింది. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ ‘సలార్’తో పాటు బాలయ్య 107వ చిత్రంతో పాటు చిరంజీవి, బాబీ సినిమాల్లో కథానాయికగా కనిపించనుంది. (Instagram/Shruti Haasan/Photo)
శృతి హాసన్ తెలుగులో ప్రస్తుతం సలార్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా చేస్తున్నారు. ఇక శృతి హాసన్ ఈ సినిమాలో ‘ఆద్య’ క్యారెక్టర్ చేస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విలన్‌గా మల యాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. (Instagram/Shruti Haasan/Photo)
నిన్నమొన్నటి వరకు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్... పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘కాటమరాయుడు’ మూవీ తర్వాత తెలుగు సినిమాలు చేయడమే మానేసింది. చాలా రోజుల తర్వాత తాజాగా రవితేజ క్రాక్ 'సినిమాతో పలకరించింది. అంతేకాదు ఆ తర్వాత ‘వకీల్ సాబ్’లో నటించింది. (Instagram/Shruti Haasan/Photo)