Shruti Haasan: శృతి హాసన్ మరో అరుదైన రికార్డు.. ఒకవైపు చిరంజీవి.. మరోవైపు బాలకృష్ణతో నటించింది. ఇలా సీనియర్ టాప్ హీరోల సరసన నటించడమే కాకుండా.. ఈ రెండు చిత్రాలు ఒక రోజు గ్యాప్‌లో విడుదల కావడం ప్రత్యేకంగా ప్రస్తావించాలి. తన తండ్రి కమల్ హాసన్‌కు తోటి హీరోలైన వీళ్లిద్దరితో నటించడం మరో విశేషం. (twitter/Photo)
శృతి హాసన్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. అంతేకాదు వెనక కొండంత అండ తండ్రి బ్యాక్ గ్రౌండ్ ఉన్న.. హీరోయిన్గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇపుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్లా మారింది. ఒకేసారి ఇద్దరు సీనియర్ బడా స్టార్ హీరోల సరసన నటించి మరోసారి వార్తల్లో నిలిచింది. (Twitter/Photo)
టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్... ప్రస్తుతం కొంత గ్యాప్ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది. ఇక 2021లో రవితేజ సరసన క్రాక్‌లో ఈ భామ అదరగొట్టింది. ఆ తర్వాత శృతి హాసన్ తెలుగులో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో మెరిసింది.ఇపుడు బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డిలో మెరిసింది. మరోవైపు చిరంజీవి సరసన ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో మెరిసింది. (Twitter/Photo)
శృతి హాసన్.. తండ్రీ తనయులైన రామ్ చరణ్‌తో ‘ఎవడు’ సినిమాలో జోడిగా నటించింది. ఇపుడు వాల్తేరు వీరయ్య’ సినిమాలో తండ్రితో కలిసి నటించింది. ఈ జనరేషన్లో తండ్రీ తనయుల సరసన నటించిన హీరోయిన్గా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు మెగాహీరోలైన పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి హీరోలతో నటించి ట్రాక్ రికార్డు శృతి హాసన్ సొంతం. (Twitter/Photo)
అయితే కమల్ హాసన్ తనయగా శ్రుతీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. మొదట్లో చాలా కష్టాలే పడింది. ఇక కెరీర్ ప్రారంభంలో ఆమె నటించిన చిత్రాలు ఫ్లాప్‌లు అవ్వడంతో.. శ్రుతీకి ఐరన్ లెగ్ అన్న ముద్ర పట్టింది. ఇక పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘గబ్బర్ సింగ్’ సక్సెస్‌తో శృతిపై ఐరన్ లెగ్ అనే ముద్ర చెరిగిపోయింది. (Instagram/Shruti Haasan/Photo)
శృతి హసన్ ఒక్క బాలీవుడ్‌నే నమ్ముకోకుండా తండ్రిలా బాలీవుడ్‌తో పాటు తెలుగు ,తమిళ్ బాషల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో సిద్దార్థకు జోడి గా ‘అనగనగా ఓ ధీరుడు’,తమిళ్ లో సూర్య హీరోగా నటించి తెలుగు లోకి డబ్బింగ్ అయిన ‘7TH సెన్స్’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ రెండు సినిమాలకు ఫీల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూ అవార్డులు కూడా అందుకుంది. (Twitter/Photo)
ప్లాప్ లు వెంటడుతున్నా శృతి హసన్ కు కలిసి వచ్చిన సంవత్సరం 2012...ఈ ఇయర్ లో శృతి ధనుష్ తో కలిసి నటించిన త్రీ, పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’ మూవీలు రిలీజయ్యాయి...త్రీ మూవీతో పర్ఫామెన్స్ ఉన్న ఆర్టిస్టుగా గుర్తుంపు తెచ్చుకుంటే, ‘గబ్బర్ సింగ్’ మూవీ బాక్సాపీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచి శృతి హాసన్‌కు ఫస్ట్ కమర్షియల్ సక్సెస్‌ను అందించింది. దీంతో శృతి ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. ఈ సినిమాతో శృతి హాసన్ ఐరన్ లెగ్ నుంచి గోల్డెన్ లెగ్గా మారింది. ఈ సినిమాతోనే ఫ్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ మంచి సక్సెస్ అందుకున్నారు.
ఆ తర్వాత ‘డి డే’, ‘రామయ్య వస్తావయ్యా’ అనే రెండు బాలీవుడ్ సినిమాలు ఒకే రోజు రిలీజై శృతి హసన్ కి ఆర్టిస్ట్ గా మంచి పేరు తీసుకోచ్చాయి.బాక్సా ఫీస్ దగ్గర హిట్ అనిపించుకున్నాయి..డి డే సినిమాకు బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా IIFA అవార్డుకు నామినేట్ అయ్యింది శృతి. హిందీలో ‘రామయ్య వస్తావయ్యా’తో పాటు తెలుగులో ఎన్టీఆర్‌తో ‘రామయ్య వస్తావయ్యా’ టైటిల్‌తో సినిమాలు చేయడం విశేషం. ఒక రోజు రెండు సినిమాలు రిలీజైన హీరోయిన్గా.. ఒక టైటిల్‌తో రెండు విభిన్న భాషల్లో సినిమా చేసిన కథానాయికగా శృతి హాసన్ రికార్డులకు ఎక్కింది.
ఈ రకంగా ఒక రోజు రెండు సినిమాలు.. రెండు టైటిల్స్‌తో సినిమాలు చేసిన ఏకైక హీరోయిన్ శృతి హాసన్ కావడం గమనార్హం. ఇపుడు వన్ డే గ్యాప్‌లో బాలయ్యతో వీరసింహారెడ్డి, చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాలతో సంక్రాంతి బాక్సాఫీస్ పోటీలో తొలిసారి పలకరించబోతుంది. ఒకే భాషలో ఒకేసారి ఇద్దరు బడా సీనియర్ హీరోలతో కలిసి శృతి నటించిన రెండు సినిమాలు వన్ డే గ్యాప్‌లో విడుదల కావడం మరో విశేషం. (Twitter/Photo)
శృతి హసన్ కేవలం హీరోయిన్‌గానే కాకుండా.. ఐటెం సాంగ్స్ చేసింది. తెలుగు తో పాటు తమిళ్ హిందీ సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారింది..తమిళ్ లో ఫూజై, పులి ,వేదాళం లాంటి సినిమాలు చేస్తే,హిందీ లో గబ్బర్ ఈజ్ బ్యాక్, వెల్ కమ్ బ్యాక్ ,రాకీ హ్యండ్ సమ్ లాంటి సినిమాలలో నటించింది..హీరోయిన్ గా బిజీగా ఉంటూనే ఐటం సాంగ్ లలో కూడా నర్తించింది శృతి హసన్...స్వతహాగా మంచి డాన్సర్ ఐనా శృతి మహేష్ బాబు హీరో గా వచ్చిన ‘ఆగడు’ సినిమాతో పాటు బాలీవుడ్ లో వచ్చిన తేవర్ (TEVAR) మూవీ లలో స్పెషల్ సాంగ్స్ తో కుర్రకారును ఉర్రూతలూగుంచింది.
2015 లో మహేష్ బాబుతో జోడిగా వచ్చిన ‘శ్రీమంతుడు’ మూవీ ఈమె కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది...తెలుగులో సూపర్ హిట్ ను నమోదు చేసిన ఈ చిత్రంలో శృతి నటిగా పర్ఫామెన్స్ ప్రదర్శిస్తూనే డ్యూయెట్ లలో కుర్రకారులను అలరించింది. ఆ తర్వాత నాగచైతన్యతో ’ప్రేమమ్’ మూవీలో నటించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్.. కాటమ రాయుడు’ సినిమాలో నటించింది. అటు సూర్యతో ‘S3’లో కూడా మెరిసింది. మరోవైపు ‘శభాష్ నాయుడు’లో నటించేందకు ఛాన్స్ వచ్చినా.. ఈ సినిమా సందర్భంగా కమల్ హాసన్ యాక్సిడెంట్‌కు గురి కావడంతో ఈ సినిమా ఆగిపోయింది. మొత్తంగా సీనియర్ హీరోలతో ఆడిపాడుతూ మళ్లీ వార్తల్లో నిలిచింది శృతి హాసన్. మరి ఈ సినిమాల సక్సెస్‌లతో శృతి హాసన్ మళ్లీ టాలీవుడ్లో జోరు చూపించే అవకాశం ఉంది.