Shruti Haasan : టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్... ప్రస్తుతం కొంత గ్యాప్ తర్వాత తెలుగులో నటిస్తోంది. గతేడాది రవితేజ సరసన క్రాక్‌లో ఈ భామ అదరగొట్టింది. ఆ తర్వాత శృతి హాసన్ తెలుగులో వకీల్ సాబ్ చిత్రంలో మెరిసింది. త్వరలో ప్రభాస్ ‘సలార్’తో పాటు బాలయ్య 107వ చిత్రంలో కథానాయికగా కనిపించనుంది. (Instagram/Photo)
Shruti Haasan : శృతి హాసన్ ప్రస్తుతం తెలుగులో ప్రస్తుతం సలార్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా చేస్తున్నారు. ఈ రోజు శృతి హాసన్ బర్త్ డే సందర్భంగా ఆమె లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ‘ఆద్య’ క్యారెక్టర్ చేస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విలన్‌గా మల యాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. Photo : Instagram
1986 జనవరి 28 కమల్ హాసన్, సారికలకు జన్మించిన శృతి హాసన్. తల్లి దండ్రులు స్వతహాగా హీరో, హీరోయిన్లు కావడంతో శృతి అడుగులు సినిమా రంగంవైపు పడ్డాయి. కెరీర్ మొదట్లో మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసిన శతి హాసన్.. ఆ తర్వాత పూర్తిగా సినిమాల వైపు దృష్టి సారించింది. మధ్యలో రెండేళ్లు గ్యాప్ తీసుకున్న ఈ భామ.. తాజాగా చిరంజీవి, బాబీ సినిమాలో కూడా ఈ భామనే కథానాయికగా ఎంపిక చేసినట్టు సమాచారం. Photo: Instagram
అయితే కమల్ హాసన్ తనయగా శ్రుతీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. మొదట్లో చాలా కష్టాలే పడింది. ఇక ప్రారంభంలో ఆమె నటించిన చిత్రాలు ఫ్లాప్‌లు అవ్వడంతో.. శ్రుతీకి ఐరన్ లెగ్ అన్న ముద్ర పట్టింది. ఇక పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘గబ్బర్ సింగ్’ సక్సెస్‌తో శృతిపై ఐరన్ లెగ్ అనే ముద్ర చెరిగిపోయింది. (Instagram/Photo)
దీంతో శ్రుతీకి అవకాశాలు కూడా కరువయ్యాయి. అయితే మొదట్లో ఐరన్ లెగ్గా పేరు మోసిన ఈ నటి ఆ తరువాత చాలా మంది స్టార్ హీరోలకు గోల్డెన్ హ్యాండ్‌గా మారింది. పవన్ కళ్యాణ్ తర్వాత ఆ తరువాత మాస్‌రాజా రవితేజకు గోల్డెన్ లెగ్‌లా మారింది శ్రుతీ. 2013లో రవితేజ సరసన శ్రుతీ బలుపు చిత్రంలో నటించగా.. ఆ మూవీ ఘన విజయం సాధించింది. అంతేకాదు అప్పటివరకు రవితేజకు వరుసగా నాలుగు ఫ్లాప్‌లు ఉండగా.. బలుపు విజయంతో మాస్ రాజా మళ్లీ హిట్ బాట పడ్డారు. (Instagram/Photo)
శృతి హాసన్ సలార్‌తో పాటు తెలుగులో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తొలిసారి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్, శృతి హాసన్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. (Photo: Twitter)
[caption id="attachment_1180886" align="alignnone" width="1080"] ఓ వైపు ప్రభాస్ వంటి యువ హీరోల సరసన చేస్తూ మరో వైపు బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ పక్కన ఆడిపాడటానికి అంగీకరించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అయితే దీనికి కారణం దర్శకుడు గోపీచంద్ మలినేని అని అంటున్నారు. (Instagram/Photo)
తనకి 'బలుపు' .. 'క్రాక్' వంటి భారీ హిట్లు ఇవ్వడం వల్లనే ఆమె ఈ సినిమాకి అంగీకరించిందని టాక్. అయితే శృతి హాసన్ ఈ సినిమాలో నటించాడనికి చాలా షరతులు పెట్టిందట. రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉండకూడదు అనేది వాటిలో ఒకటి అని అంటునట్నారు. అన్నిటికీ అంగీకరించే గోపీచంద్ ఓకే అనేశాడట. దాంతో పాటు సినిమాకు కూడా ఇదే కండిషన్స్ పెట్టిందట. ఇక శృతి హాసన్ యవ్వారాలు చూసి సీనియర్ హీరోలు ఆమె కున్న డిమాండ్ చూసి గప్‌చుప్‌గా సర్ధుకుపోతున్నారు. (Instagram/Photo)