Shruti Haasan : టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్... ప్రస్తుతం కొంత గ్యాప్ తర్వాత తెలుగులో నటిస్తోంది. గతేడాది రవితేజ సరసన క్రాక్‌లో ఈ భామ అదరగొట్టింది. ఆ తర్వాత శృతి హాసన్ తెలుగులో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో మెరిసింది. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ ‘సలార్’తో పాటు బాలయ్య వీరసింహఆ రెడ్డి చిత్రంతో పాటు చిరంజీవి, బాబీ వాల్తేరు వీరయ్య సినిమాలో కథానాయికగా కనిపించనుంది. Photo : Instagram
ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. ఇక అది అలా ఉంటే శృతిహాసన్ దాదాపుగా తన తండ్రి వయస్సు కలిగిన ఇద్దరు సీనియర్ హీరోల సరసన నటించడంపైనే నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. సీనియర్ నటులతో నటించడానికి కారణం అవకాశాలు లేవనా లేక డబ్బు కోసమా అంటూ కొందరు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో శృతిహాసన్ అలా కామెంట్స్ చేస్తున్నవారికి స్ట్రాంగ్‌గానే బదులిచ్చారు. Photo : Twitter
శృతి హాసన్ తన ట్విట్టర్లో ట్రోలింగ్ చేస్తున్నవారికి కౌంటర్ ఇస్తూ.. సినిమా రంగంలో ఏజ్ అన్నది నంబర్ మాత్రమేనని.. ప్రతిభ, సత్తా ఉంటే బ్రతికి ఉన్నంత వరకూ నటించవచ్చన్నారు. అయితే సీనియర్ హీరోలతో నటించడం ఇదే మొదటిసారికాదని.. గతంలో పలువురు హీరోయిన్స్ తమ వయసులో సగం వయసు గల హీరోయిన్లతో నటించి నిరూపించారని.. తానేమీ ఇందుకు అతీతం కాదని అన్నట్లు తెలుస్తోంది. Photo : Twitter
అది అలా ఉంటే శృతి హాసన్‌కు ఓ ఇంటర్నేషనల్ సినిమాలో అవకాశం వచ్చినట్లు సమాచారం. ఈ సినిమా ప్రస్తుతం గ్రీస్‌లో షూటింగ్‌ను జరుపుకుంటోందట. 'ది ఐ' పేరుతో వస్తున్న ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్’గా రాబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో మార్క్ రౌలీ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. డాఫ్నే ష్మోన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఎమిలీ కార్ల్టన్ స్క్రీన్ ప్లేని అందిస్తున్నారు.. (Instagram/Shruti Haasan/Photo)
ఇక ప్రస్తుతం ఆమె శాంతను హజారికాతో కలిసి సహ జీవనం చేస్తోంది. పెళ్లి అంటే నమ్మకం ఉన్న లోపల మాత్రం ఏదో తెలియని ఆందోళన ఉన్నట్టు చెప్పుకొచ్చారు. పైగా శాంతను తన జీవితంలో వచ్చిన తర్వాత నా లైఫ్‌లో ఎన్నో మార్పులొచ్చాయన్నారు. మా ఇద్దరి ఆలోచనలు ఒకే రకంగా ఉన్నాయి. మరి ఈమె డేటింగ్ చేస్తోన్న శాంతనుతో ఈమె ప్రేమాయణం పెళ్లి పీఠల వరకు వెళుతుందా లేదా అనేది చూడాలి. (Instagram/Shruti Haasan/Photo)
ఇక శృతి హాసన్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం తెలుగులో సలార్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా చేస్తున్నారు. ఇక శృతి హాసన్ ఈ సినిమాలో ‘ఆద్య’ క్యారెక్టర్ చేస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విలన్‌గా మల యాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. (Instagram/Shruti Haasan/Photo)
ఇక శృతి పర్సనల్ విషయానికి వస్తే.. 1986 జనవరి 28 కమల్ హాసన్, సారికలకు జన్మించింది శృతి హాసన్. తల్లి దండ్రులు స్వతహాగా హీరో, హీరోయిన్లు కావడంతో శృతి అడుగులు సినిమా రంగంవైపు పడ్డాయి. కెరీర్ మొదట్లో మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసిన శతి హాసన్.. ఆ తర్వాత పూర్తిగా సినిమాల వైపు దృష్టి సారించింది. మధ్యలో రెండేళ్లు గ్యాప్ తీసుకున్న ఈ భామ.. ఇపుడు చిరంజీవి, బాలయ్య సినిమాలతో పాటు ప్రభాస్ సలార్‌లో నటిస్తోంది. (Instagram/Shruti Haasan/Photo)
దీంతో అవకాశాలు కూడా కరువయ్యాయి. అయితే మొదట్లో ఐరన్ లెగ్గా పేరు మోసిన ఈ నటి ఆ తరువాత చాలా మంది స్టార్ హీరోలకు గోల్డెన్ హ్యాండ్‌గా మారింది. పవన్ కళ్యాణ్ తర్వాత ఆ తరువాత మాస్‌రాజా రవితేజకు గోల్డెన్ లెగ్‌లా మారింది శృతి. 2013లో రవితేజ సరసన శ్రుతీ బలుపు చిత్రంలో నటించగా.. ఆ మూవీ ఘన విజయం సాధించింది. అంతేకాదు అప్పటి వరకు రవితేజకు వరుసగా నాలుగు ఫ్లాప్‌లు ఉండగా.. బలుపు విజయంతో మాస్ రాజా మళ్లీ హిట్ బాట పడ్డారు. ఇక ఆ తర్వాత క్రాక్‌లో నటించి మరో హిట్ అందుకుంది ఈజంట. (Instagram/Shruti Haasan/Photo)