బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన RRR.. డిజిటల్ స్ట్రీమింగ్‌లో కూడా సత్తా చాటుతోంది. ఈ సినిమా రైట్స్‌కు కూడా భారీ స్థాయిలో డిమాండ్ చేకూరిన సంగతి మనందరికీ తెలుసు. దక్షిణాది భాషల స్ట్రీమింగ్ హక్కులను బడా సంస్థ జీ5 సొంతం చేసుకోగా.. హిందీ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసుకుంది. డిజిటల్ వ్యూస్ పరంగా కూడా ఈ సినిమా రికార్డులు నెలకొల్పింది.