ఆర్ఆర్ఆర్ మూవీలో శ్రియకు ఏ కీలక పాత్ర ఆఫర్ చేశారని కొద్దిరోజులుగా టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో నటిస్తున్న అజయ్ దేవగన్‌కు భార్యగా శ్రియ నటిస్తోందని సమాచారం. అయితే ఈ సినిమాలో శ్రియకు ఛాన్స్ రావడం వెనుక అనుష్క హ్యాండ్ కూడా ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదట ఈ పాత్ర కోసం రాజమౌళి అనుష్కను సంప్రదించాడని... అయితే కొన్న కారణాల వల్ల ఆమె నో చెప్పడంతో శ్రియకు ఈ ఛాన్స్ వచ్చిందని టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ జోరందుకుంది. మొత్తానికి రాజమౌళి సినిమాలో ఛాన్స్ రావడం శ్రియ కెరీర్‌కు కొత్త ఉత్సాహానిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.