Home » photogallery » movies » SHREYA GHOSHAL LOOKS RAVISHING IN HER LATEST INSTA PICS SEE HERE GALLERY SR

Shreya Ghoshal : కుందనపు బొమ్మ శ్రేయ ఘోషాల్ బ్యూటీఫుల్ పిక్స్..

Shreya Ghoshal : శ్రేయ ఘోషాల్.. ఓ అద్బుత గాయని. తన గొంతుతో యావత్ భారతవనిని తనవైపు తిప్పుకోగలదు. ఆమె హిందీలోనే కాకుండా.. తెలుగు, ఇతర సౌత్ ఇండియా భాషాల్లో కూడా ఎన్నో మంచి పాటలు పాడింది. శ్రేయ ఘోషాల్ తెలుగులో 'ఒక్కడు' సినిమాకు మొదటగా పాడింది.. "నువ్వేం మాయ చేసావో గాని " అంటూ ఆమె పాడిన ఆ పాట.. ఎంత పాపులరో తెలిసిందే. ఆ ఒక్క చిత్రంలోనే కాకుండా ఆమె తెలుగులో చాలా సినిమాల్లో పాడారు. పాడుతూనే ఉన్నారు. శ్రేయ ఘోషాల్ పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్‌లో జన్మించారు. ఆమె తండ్రి బిశ్వజీత్ ఘోషాల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇంజనీరుగా పని చేసేవారు. తల్లి లిటరేచర్‌లో పోస్ట్ గ్రాడ్యూయేట్. శ్రేయ తన సంగీత ప్రస్థానాన్ని హిందీ సినిమా "దేవదాస్"తో ప్రారంభించారు. మొదటి చిత్రమే ఆమెకు జాతీయ అవార్డ్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికి శ్రేయకు 4 జాతీయ పురస్కారాలు, 9 ఫిల్మ్ ఫేర్ అవార్డ్‌లు లభించాయి.